RBI Interest Rates: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి..

RBI Interest Rates: వరుసగా పదకొండో సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

Update: 2024-12-06 06:18 GMT

RBI Interest Rates: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి..

RBI Interest Rates: వరుసగా పదకొండో సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పాటు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఆ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తూ వస్తోంది.

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయని... ఆర్థిక రంగం ఉత్తమంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాల పరిమితిని 1.6 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితిని పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

Tags:    

Similar News