Bank e-KYC: ఈ బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 26లో ఈ పనిచేయకుంటే మీ అకౌంట్ బ్లాక్

Update: 2025-03-01 05:30 GMT

Bank e-KYC: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, వినియోగదారులకు బిగ్ అలర్ట్. నో యువర్ కస్టమర్ సమాచారాన్ని అప్ డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొంతమంది తన కస్టమర్లను కోరింది. ఆర్బిఐ రూల్స్ ప్రకారం ఈ ప్రకటన విడుదల చేసింది. కేవైసీ అప్ డేట్ చేయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ అకౌంట్ విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటన 2024 డిసెంబర్ 31 నాటికి కేవైసీ అప్ డేట్ చేయని అకౌంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. మీ అకౌంట్ కు కేవైసీ అప్ డేట్ గా ఉంటే చేయాల్సిన అవసరం లేదు. ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం డిజిటల్ కేవైసీ కూడా చేయవచ్చు. ఇందులో కస్టమర్ లైవ్ ఫొటో తీసుకుంటారు. అధికారిక ఐడీ ఫొటోను క్యాప్చర్ చేస్తారు. ఫొటో తీసిన లొకేషన్ రికార్డ్ చేస్తారు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆథరైజ్డ్ ఆఫీసర్ లేదా ఆర్బిఐ నియంత్రణలోని ఏదైనా ఇతర బ్యాంకు చేయవచ్చు.

ఏదైనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వెళ్లి కేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చు. లేదా పీఎన్బీ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ కు రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించవచ్చు. మీ అకౌంట్ కు ఎలాంటి సమస్య రావద్దనుకుంటే 2025 మార్చి 26లోపు ఈ కేవైసీ అప్ డేట్ పూర్తి చేసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు కొన్ని డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేసి కేవైసీ ప్రాసెస్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ , ఇటీవలి ఫొటో, పాన్ లేదా ఫారం 60, ఇన్ కమ్ ప్రూఫ్, మొబైల్ నెంబర్ అందజేయాల్సి ఉంటుంది.

గడువు తేదీలోగా ఈకేవైసీ అప్ డేట్ చేయనట్లయితే అకౌంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. అంటే మీరు డబ్బు విత్ డ్రా చేయలేరు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరపలేరు. ఇతర బ్యాంకింగ్ సర్వీసులను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.


Tags:    

Similar News