LPG Price 1 March 2025: సామాన్యులకు బిగ్ షాక్...మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు
LPG cylinders are rising in India
LPG Price 1 March 2025: దేశవ్యాప్తంగా నిత్యవసర, అత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు కూడా పెరుగుతున్నాయి. వంట నూనెలు అయితే 50శాతం పెరిగాయి. వీటన్నింటితోనే ఇబ్బంది అనుకుంటే వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సిలిండర్ బుక్ చేయాలంటే జేబు తుడుముకోవల్సి వస్తుంది. మార్చి 1న వాణిజ్య ఎల్పీజీ సిలింధర్ మరోసారి పెరిగింది.
మార్చి 1వ తేదీ శనివారం ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలు విడుదలయ్యాయి. కొత్త ధరల ప్రకారం బడ్జెట్ రోజున ఇచ్చిన ఉపశమనం ఇప్పుడు తీసేశారు. 19కేజీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రధన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర భగ్గమంటోంది. నేడు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్...ఢిల్లీ నుంచి కోల్ కత వరకు 6 రూపాయలు పెరిగింది. అయితే మార్చిలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరల ట్రెండ్ ను పరిశీలిస్తే గత 5ఏళ్లలో మార్చి 1న అత్యల్ప పెరుగుదల ఉంది. ఇండియన్ ఆయిల్ పోర్టల్ లో ఇచ్చిన డేటా ప్రకారం మార్చి 2023లో వాణిజ్య సిలిండర్ ధర అత్యధికంగా పెరిగింది. ఆ సమయంలో ధర ఒకేసారి రూ. 352 పెరిగింది. ఈ సారి రూ. 6 మాత్రమే పెరిగింది.
హైదరాబాద్ లో ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2029కి చేరుకుంది. ఫిబ్రవరిలో దీని ధర రూ. 2023 ఉండగా..జనవరిలో రూ. 2030గా ఉంది. విజయవాడలో ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1958కి చేరుకుంది. ఫిబ్రవరిలో దీని ధర రూ. 1964 ఉండగా...జనవరిలో రూ. 1957 ఉంది.