Post office: రోజుకు రూ. 100 పొదుపు చేస్తే రూ. 2 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు.. బెస్ట్ స్కీమ్

Post office: బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు నగరాల్లో అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆర్థిక సేవలకు పూర్తిగా చేరువ కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌ల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.

Update: 2025-05-28 15:00 GMT

Post office: రోజుకు రూ. 100 పొదుపు చేస్తే రూ. 2 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు.. బెస్ట్ స్కీమ్

Post office: బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు నగరాల్లో అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆర్థిక సేవలకు పూర్తిగా చేరువ కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌ల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.

ఈ పథకాలలో పెట్టుబడి పెడితే, ప్రభుత్వం హామీ ఇచ్చే స్థిరమైన వడ్డీతో పాటు, భద్రతా ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్. పోస్టాఫీస్ ఆర్‌డీ అనేది త‌క్కువ మొత్తంలో పెట్టుబ‌డి ప‌పెట్టాల‌నుకునే వారికి బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఇందులో నెలకు కనీసం రూ. 100 నుంచి ఏదైనా మొత్తం వేరుగా జమ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు.

ఈ స్కీమ్ ఐదు సంవత్సరాల గడువు కలిగి ఉంటుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 6.7%గా ఉంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ కాంపౌండ్ అవుతుంది. ఉదాహరణకు నెలకు రూ. 3,000 చొప్పున డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో రూ. 1.8 లక్షలు పెట్టుబ‌డి పెడ‌తారు. దీనిపై సుమారు రూ. 34,097 వడ్డీ లభిస్తుంది. ఇలా వ‌డ్డీ, అస‌లు క‌లిపి మొత్తం రూ. 2,14,097 మెచ్యూరిటీ మొత్తంగా వస్తుంది. అంటే రోజుకు రూ. 100 పెట్టుబ‌డి పెడితే స‌రిపోతుంద‌న్న‌మాట‌.

తక్షణ అవసరాలకు లోన్ సౌకర్యం

స్కీమ్ ప్రారంభించిన 12 నెలల తర్వాత, అందులో ఉండే మొత్తం మీద 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకున్న లోన్‌ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లించవచ్చు. వడ్డీ రేటు 8.7%గా ఉంటుంది. లోన్‌ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో తీసుకుపోతే, రాబడి నుంచి త‌గ్గిస్తారు.

ఈ స్కీమ్‌కు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. అయితే దీనిని మీరు మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు. అదే వడ్డీ రేటుతో (6.7%) కొనసాగుతుంది. ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. పూర్తిగా ముగిసిన సంవత్సరాలకే ఆర్‌డీ వడ్డీ వర్తించుతుంది. అదనపు నెలలకు మాత్రం 4% పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ వర్తిస్తుంది. ముందస్తుగా 6 లేదా 12 నెలల డిపాజిట్‌లు చెల్లిస్తే డిస్కౌంట్ లాంటి రిబేట్ కూడా లభిస్తుంది.

ముందస్తుగా క్లోజ్ చేసే అవకాశాలు

ఈ ఖాతాను కనీసం 3 ఏళ్ల తర్వాత ముందస్తుగా క్లోజ్ చేయ‌వ‌చ్చు. కానీ పూర్తి 5 ఏళ్లకు ముందే క్లోజ్ చేస్తే కేవలం 4% వడ్డీ మాత్రమే లభిస్తుంది. మిస్ అయిన నెలవారీ డిపాజిట్‌కు రూ. 100కు రూ. 1 జరిమానా ఉంటుంది. వ‌రుస‌గా నాలుగు నెలల చెల్లింపులు చేయ‌క‌పోతే అకౌంట్‌ను నిలిపివేస్తారు. కానీ, రెండు నెలల్లో మళ్లీ రీస్టార్ట్ చేయవచ్చు.

ఈ స్కీమ్‌లో డిపాజిట్‌లకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉండదు. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి వడ్డీ రూ. 10,000 దాటితే TDS వర్తిస్తుంది పాన్ ఉంటే 10%, లేకపోతే 20%. ఈ ఖాతాను వ్యక్తిగతంగా లేదా ముగ్గురితో క‌లిసి జాయింట్‌గా ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట, వారిని సంరక్షించే వ్యక్తి ద్వారా ఖాతా ప్రారంభించొచ్చు.

Tags:    

Similar News