PM Kisan 19th Installment: పీఎం కిసాన్ 19వ విడతకు తేదీ ఖరారు.. మీ పేరు ఉందేమో స్టేటస్ చెక్ చేసుకోండిలా..!

PM Kisan 19th Installment Date: రైతులకు అదిరిపోయే శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమైంది.

Update: 2025-02-15 03:42 GMT

PM Kisan

PM Kisan 19th Installment Date: రైతులకు అదిరిపోయే శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమైంది. ఈ ఫిబ్రవరి 2025 చివరి వారంలోనే ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బిహార్ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో పలు వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.

పీఎం కిసాన్ స్కీమ్:ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ మొత్తం మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. కానీ, రైతులు ఈ సాయం పొందాలంటే తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇ-కేవైసీ ప్రక్రియ OTP ఆధారంగా, పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పూర్తి చేయవచ్చు.

పీఎం కిసాన్ పథకానికి అనర్హులు

కొంతమంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా సాయం పొందలేరు. వీరిలో ప్రధానంగా:

* రాజ్యాంగపరమైన పోస్టులలో ఉన్నవారు

* మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్మన్లు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులు, ఆటోనమస్ బాడీలు, లోకల్ బాడీ ఉద్యోగులు

* రూ.10 వేలకుపైగా పెన్షన్ పొందుతున్న వారు

* ఆదాయపు పన్ను చెల్లించే వారు (డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్టులు)

ఈ నిబంధనల ప్రకారం, పైన పేర్కొన్న వ్యక్తులు పీఎం కిసాన్ పథకంలో అర్హత పొందలేరు.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి:

* అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలోకి వెళ్లండి.

* "స్టేటస్" లింక్ పై క్లిక్ చేయండి.

* మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు.

* అవసరమైన వివరాలు ఎంటర్ చేసి "గేట్ డేటా"పై క్లిక్ చేయండి.

మీ లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ సాయం అందుకోవాలంటే రైతులు ఇ-కేవైసీ పూర్తి చేయాలి.

Tags:    

Similar News