PM Kisan: రైతన్నలకు శుభవార్త.. వారికి 14వ విడత సాయం కింద రూ.4వేలు.. అందులో మీరున్నారా?

PM Kisan 14th Installment: రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది.

Update: 2023-04-26 14:30 GMT

PM Kisan: రైతన్నలకు శుభవార్త.. వారికి 14వ విడత సాయం కింద రూ.4వేలు.. అందులో మీరున్నారా?

PM Kisan 14th Installment: రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (PM Kisan) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. అర్హులైన రైతన్నలకు ఏదాడికి 3 సార్లు రూ.2000ల చొప్పున.. 3 వాయిదాలలో అందిచడమే. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.6000లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంటారు.

అయితే, పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటివరకు 13 వాయిదాలను రైతులకు అందించింది. ఈ క్రమంలో 14వ విడత సాయం రూ. 2000ల సాయం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కొంతమంది రైతులు 2 వాయిదాల సాయం అంటే రూ. 4000లను ఒకేసారి అందుకుంటారని తెలుస్తోంది. అంటే, ఎవరైతే 13వ విడతలో సాయం రూ.2000లు అందుకోలేదో.. వారు 14వ విడత సాయంలో మొత్తం రూ.4000లు అందుకుంటారని చెబుతున్నారు.

వెరిఫికేషన్ ప్రక్రియ అసంపూర్తిగా ఉండిపోవడంతో కొంతమంది రైతులు 13వ విడత సాయం అందుకోలేకపోయారంట. ఇలాంటి వారు రూ.2000 బదులుగా రెండు వాయిదాలు కలిపి మొత్తం రూ.4000లు అందుకుంటారు.

కాగా, 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News