Paytm : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. 5 కొత్త ఫీచర్లతో పేమెంట్స్ చాలా ఈజీ!
Paytm: భారతదేశంలో UPI పేమెంట్ సిస్టమ్ వచ్చినప్పుడు పేటీఎం ముందు వరుసలో నిలిచింది. ఈ రంగంలో కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చి పేటీఎం అందరి దృష్టిని ఆకర్షించింది.
Paytm : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. 5 కొత్త ఫీచర్లతో పేమెంట్స్ చాలా ఈజీ!
Paytm: భారతదేశంలో UPI పేమెంట్ సిస్టమ్ వచ్చినప్పుడు పేటీఎం ముందు వరుసలో నిలిచింది. ఈ రంగంలో కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చి పేటీఎం అందరి దృష్టిని ఆకర్షించింది. QR కోడ్, సౌండ్‌బాక్స్ టెక్నాలజీలను పరిచయం చేసింది కూడా పేటీఎమే. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకునే పేటీఎం, ఇప్పుడు ఐదు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది.
1. మీకు నచ్చిన ట్రాన్సాక్షన్స్‌ను హిస్టరీలో దాచవచ్చు
ఇది చాలా గోప్యంగా ఉండాలని మీరు కోరుకునే లేదా వ్యక్తిగతమైన లావాదేవీలు మీ పేమెంట్ హిస్టరీలో కనిపించకుండా చేసే ఫీచర్. యాప్‌లోని బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగంలో లిస్ట్ అయ్యే పేమెంట్ హిస్టరీ నుండి మీకు నచ్చిన UPI ట్రాన్సాక్షన్‌లను హైడ్ చేయవచ్చు. అలాగే, వ్యూ హిడెన్ పేమెంట్స్ విభాగానికి వెళ్లి వాటిని మళ్ళీ అన్‌హైడ్ చేయవచ్చు. అన్‌హైడ్ చేయడానికి మీ అథెంటికేషన్ అవసరం.
2. PDF, Excel ఫార్మాట్లలో UPI స్టేట్‌మెంట్
మీరు మీ UPI ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్స్‌ను PDF, Excel ఫార్మాట్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఖర్చులను ట్రాక్ చేయడానికి, బడ్జెట్ వేసుకోవడానికి, అకౌంటింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. UPI IDలో మొబైల్ నంబర్‌ను సీక్రెట్ గా ఉంచండి
Paytmలో మీరు వ్యక్తిగతమైన UPI IDని క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీ మొబైల్ నంబర్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కోరుకున్న పేరుతో కూడిన UPI IDక్రియేట్ చేసుకోవచ్చు.
4. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయండి
UPI యాప్‌లలో మీరు బ్యాంక్ అకౌంట్ల నుండి లావాదేవీలు చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. UPIకి జోడించిన అన్ని బ్యాంక్ అకౌంట్ల బ్యాలెన్స్ ఎంత ఉందో Paytm యాప్‌లో ఒకే చోట చూసుకోవచ్చు.
5. ఫోన్ హోమ్ స్క్రీన్‌లో QR విడ్జెట్
డబ్బును స్వీకరించడానికి ఉపయోగించే QR విడ్జెట్‌ను ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఉంచే అవకాశాన్ని Paytm అందిస్తుంది. ఇది క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు మొదలైన వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కస్టమర్ల నుండి డబ్బు స్వీకరించడానికి యాప్‌ను తెరిచి QR కోడ్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఉన్న ఈ విడ్జెట్‌ను నొక్కితే QR కోడ్ ఓపెన్ అవుతుంది. కస్టమర్లు దానిని స్కాన్ చేసి డబ్బు పంపవచ్చు.