Credit Card Payments: క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లిస్తే లాభమా, నష్టమా.. అవగాహన కచ్చితంగా అవసరం..!

Credit Card Payments: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డ్‌ల వినియోగం బాగా పెరిగింది. చిన్న చిన్న చెల్లింపులు కూడా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు.

Update: 2023-08-05 15:30 GMT

Credit Card Payments: క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లిస్తే లాభమా, నష్టమా.. అవగాహన కచ్చితంగా అవసరం..!

Credit Card Payments: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డ్‌ల వినియోగం బాగా పెరిగింది. చిన్న చిన్న చెల్లింపులు కూడా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు. అలాగే బ్యాంకులు కూడా క్రెడిట్‌ కార్డులు తీసుకునేలా ఖాతాదారులని ప్రోత్సహిస్తున్నాయి. ఇక ప్రైవేట్‌ బ్యాంకులైతే వెంటబడి మరీ అంటగడుతున్నాయి. వీటివల్ల బ్యాంకులకి లాభం జరుగుతుంది కావొచ్చు కానీ చాలావరకు కస్టమర్లకి నష్టమే జరుగుతుందనే చెప్పాలి. క్రెడిట్‌ కార్డుల వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి ఈరోజు ఓ లుక్కేద్దాం.

ప్రయోజనాలు

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల రివార్డ్‌లు వస్తాయని అందరికి తెలుసు. ఇవి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల రూపంలో ఉంటాయి. అలాగే రోజువారీగా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వ్యక్తులు అలాగే సకాలంలో బిల్లులు చెల్లించే వ్యక్తులు క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. ఇది వారికి భవిష్యత్తులో రుణాలపై మెరుగైన డీల్‌ని పొందడానికి సహాయపడుతుంది. ఇంకా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఈఎంఐ ద్వారా వస్తువులని తీసుకోవడానికి అనుమతిస్తాయి. క్రెడిట్‌ కార్డుల వల్ల పెద్ద వస్తువులను కొనుగోలు చేయడం సులభం అవుతుంది.

అప్రయోజనాలు

క్రెడిట్ కార్డ్‌ వల్ల ఒక వ్యక్తి తన స్థోమతకి మించి ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల అధిక వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రతి నెలా బ్యాలెన్స్‌పై వడ్డీ పెరుగుతూ ఉంటుంది. చివరికి ఇది మీరు చెల్లించలేని పెద్ద గుదిబండలా మారుతుంది. అయితే కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వ్యవధిలోపు బిల్లును తిరిగి చెల్లించినట్లయితే వడ్డీ చెల్లింపును మాఫీ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. అలాగే సకాలంలో బిల్లు చెల్లింపులు చేయకపోతే క్రెడిట్‌ స్కోరుపై ఎఫెక్ట్‌ పడుతుంది. అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలను పొందడం చాలా కష్టమవుతుంది.

Tags:    

Similar News