PAN Card Alert: ముగిసిన డెడ్ లైన్.. మీ పాన్ కార్డ్ ఇంకా పనిచేస్తోందా? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి!
పాన్-ఆధార్ లింక్ గడువు ముగియడంతో, మీ పాన్ కార్డు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఆన్‌లైన్‌లో కేవలం రెండు నిమిషాల్లో పాన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.
పాన్-ఆధార్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఇచ్చిన గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన కేంద్రం, ఈసారి మాత్రం ఎటువంటి పొడిగింపు ప్రకటించలేదు. దీంతో లింక్ చేసుకోని వారి పాన్ కార్డులు 'ఇనాక్టివ్' (Inoperative) అయ్యే అవకాశం ఉంది. మరి మీ పాన్ కార్డ్ ప్రస్తుతం యాక్టివ్‌లో ఉందో లేదో తెలియక టెన్షన్ పడుతున్నారా? కేవలం రెండు నిమిషాల్లో మీ ఫోన్ ద్వారానే స్టేటస్ తెలుసుకోవచ్చు.
పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసే విధానం:
మీ పాన్ కార్డ్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- వెబ్‌సైట్: ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometax.gov.in ఓపెన్ చేయండి.
- క్విక్ లింక్స్: హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న 'Quick Links' విభాగంలోకి వెళ్ళండి.
- వెరిఫై పాన్: అక్కడ ఉన్న 'Verify Your PAN' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- వివరాలు: మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ మరియు మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- OTP: మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి 'Validate' పై క్లిక్ చేయండి.
- స్టేటస్: ఇప్పుడు మీ స్క్రీన్‌పై "PAN is Active" అని వస్తే మీ కార్డు సురక్షితంగా ఉన్నట్టే. ఒకవేళ ఇనాక్టివ్ అని వస్తే మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయితే వచ్చే చిక్కులివే:
మీ పాన్ కార్డ్ పనిచేయకపోతే ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది:
- బ్యాంక్ పనులు: కొత్త బ్యాంక్ ఖాతా తెరవలేరు. డెబిట్, క్రెడిట్ కార్డులు పొందడం అసాధ్యం.
- పెట్టుబడులు: మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టలేరు.
- నగదు పరిమితి: రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయలేరు.
- ట్యాక్స్ రీఫండ్: పెండింగ్‌లో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్‌లు నిలిచిపోతాయి.
- అధిక పన్ను: టీడీఎస్ (TDS) వంటివి సాధారణ రేటు కంటే ఎక్కువగా కట్ అవుతాయి.