FASTag: మీరు ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్‌ను కార్‌పై అతికించలేదా? అయితే కొత్త రూల్స్ వచ్చాయి జాగ్రత్త..!
FASTag: హైవేపై ప్రయాణం చేసే వాహనదారులు మరింత సౌకర్యవంతగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
FASTag: మీరు ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్‌ను కార్‌పై అతికించలేదా? అయితే కొత్త రూల్స్ వచ్చాయి జాగ్రత్త..!
FASTag: హైవేపై ప్రయాణం చేసే వాహనదారులు మరింత సౌకర్యవంతగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫాస్టాగ్ టెక్నాలజీని సక్రమంగా వినయోగించిన వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనుంది. వివరాలు తెలుసుకుందాం.
చాలామంది జాతీయ రహదారులపై వెళుతున్నప్పుడు ఫాస్ట్ ట్యాక్ స్టిక్కర్‌ను కార్‌కు అతికించరు. టోల్ దగ్గరకు వచ్చిన తర్వాత జేబులోంచి తీసి చూపిస్తారు. అయితే ఇలాంటి లూజ్ ఫాస్టాగ్‌లు ఇక నుంచి చెల్లవని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ పాస్ చేసింది. కార్‌పై స్టిక్కర్ పెట్టకుండా జేబులో పెట్టుకుంటే వాహదారులను ఇకపై బ్లాక్ లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది.
కొత్త రూల్స్ ప్రకారం, దేశంలోని జాతీయ రహదారులపై నడిపే వాహనదారులు కచ్చితంగా ఫాస్టాగ్ స్టిక్కర్‌ని కచ్చితంగా విండ్షీల్డ్‌పై అతికించాల్సిందే. అది కూడా శ్వాశ్వతంగా. కానీ కొందరు డ్రైవర్లు ఫాస్టాగ్‌ను స్టైల్ కోసమో లేక వాహనంపై ఉన్న విండ్షీల్డ్ పాడవుతుందనో స్టిక్కర్ అంటిచరు. అయితే టోల్ గేట్ వచ్చిన తర్వాత జేబులో తీసి ఆ స్టిక్కర్‌ని చూపిస్తారు. ఇక ఇలా చేసిన వాళ్లు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోతారు. బ్లాక్ లిస్ట్ లోకి పేరు వెళితే ఇక ఆ వాహనదారుడు జాతీయ రాహదారిపై ఇక ప్రయాణించలేడు.
స్టిక్కర్ విండ్షీల్డ్‌పై అతికించకపోవడంతో టోల్ స్కానింగ్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. అంతేకాదు రద్దీ కూడా ఎక్కువైపోతుంది. ఎంతోమంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ట్యాగ్ ఇన్ హ్యాండ్ తరహా లూజ్ ఫాస్టాగ్‌ల వాడకాన్ని నిలిపివేసింది.
ఎవరైనా వాహనదారుడు జేబులోంచి తీసి ఫాస్ట్ స్టాగ్ స్టిక్కర్ ఇస్తే టోల్ గేట్ సిబ్బంది వెంటనే ఈ మెయిల్ ద్వారా వాహనదారుడు, వాహనం వివరాలు వెంటనే పంపించాలని కూడా ఈ రూల్స్‌లో ఉంది. ఈ మెయిల్ చెక్ చేసిన సంబంధిత అధికారులు వెంటనే ఆ వాహనదారుడ్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. ఆ తర్వాత వాహనదారుడు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా జేబులోంచి తీసి ఫాస్టాగ్ స్టిక్కర్‌ని చూపిస్తారు. ఇక నుంచి అలా చేయకుండా కొత్త రూల్ ఫాలో అవడం మంచిది.