Money Tips: ఒక్క రూపాయ్‌తోనే కోటి రూపాయలు.. నిజ జీవితంలో డబుల్ జాక్‌పాట్ ఇదే!
కనిపిస్తాయి కానీ చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. డబ్బులు ఉన్నట్టే అనిపిస్తాయి కానీ వాస్తవంలో లేవు. అవును.. ఇది క్రిప్టోకరెన్సీ మ్యాజిక్. ముఖ్యంగా బిట్‌కాయిన్ మ్యాజిక్! ఒకే ఒక్క రూపాయి పెట్టుబడితో అక్షరాలా కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమేనని బిట్‌కాయిన్ నిరూపించింది.

2010లో ఒక్క రూపాయి ఇస్తే ఒక బిట్‌కాయిన్ కొనగలిగేవారు. అదే బిట్‌కాయిన్ ఇప్పుడు కోటి రూపాయల మార్క్‌ను దాటేసింది. అంటే అప్పట్లో పది రూపాయలు పెట్టి పది బిట్‌కాయిన్లు కొంటే, ఇప్పుడు మీ జేబులో 10 కోట్ల రూపాయలు ఉన్నట్టే!
ప్రస్తుతం బిట్‌కాయిన్ క్రిప్టో వరల్డ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన రేటును తానే బద్దలు కొడుతూ లక్ష డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఒక బిట్‌కాయిన్ కూడా ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, పది లేదా వంద బిట్‌కాయిన్లు ఉంటే మిలియనీర్ల జాబితాలో చేరడం ఖాయం.
బిట్‌కాయిన్ రేటు సప్లయ్-డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త బిట్‌కాయిన్లు సృష్టించడం అంత ఈజీ కాదు; క్లిష్టమైన డిజిటల్ మైనింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే అవి రూపొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా 21 మిలియన్ బిట్‌కాయిన్లు మాత్రమే మింట్ చేయగలరనే పరిమితి కారణంగా కూడా దాని విలువ పెరుగుతోంది.
నాలుగేళ్లకోసారి కొత్త బిట్‌కాయిన్లు మార్కెట్‌లోకి వస్తాయి, రేటు సగానికి పడిపోతుంది. అయినప్పటికీ గోల్డ్, స్టాక్స్‌తో పోలిస్తే బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడి ఇస్తోంది. ఈ బుల్ ర్యాలీ కారణంగా భారతీయ ఇన్వెస్టర్లు కూడా దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ కోసం ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు.