Cryptocurrency as Property: డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం.. క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన హైకోర్టు..!

Cryptocurrency as Property: క్రిప్టో కరెన్సీపై మద్రాస్ హైకోర్టు (Madras High Court ) కీలక తీర్పు వెలువరించింది.

Update: 2025-10-26 12:23 GMT

Cryptocurrency as Property: డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం.. క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన హైకోర్టు..!

Cryptocurrency as Property: క్రిప్టో కరెన్సీపై మద్రాస్ హైకోర్టు (Madras High Court ) కీలక తీర్పు వెలువరించింది. క్రిప్టోకరెన్సీ భారత చట్టం ప్రకారం ఆస్తిగా భావించాల్సి ఉంటుందని, అది కేవలం డిజిటల్ కరెన్సీ మాత్రమే కాదని కోర్టు స్పష్ట చేసింది. ఆ తీర్పు డిజిటల్ ఆస్తులను యాజమాన్యం, రక్షణతో పాటు చట్టపరమైన అంశాల్లోకి తెచ్చే దిశగా తీసుకెళ్లనుంది. XRP వంటి క్రిప్టోకరెన్సీలు భౌతిక ఆస్తులు లేదా చట్టబద్ధమైన టెండర్ కానప్పటికీ, అవి ఆస్తికి సంబంధించిన అన్ని ప్రధాన లక్షణాలను ప్రదర్శిస్తాయని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ శనివారం తీర్పిచ్చారు. కాగా, మన దేశంలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించలేదు. దానికి ఎటువంటి రక్షణ లేదని తెలిసిందే.

“క్రిప్టో కరెన్సీ ఒక స్పష్టమైన ఆస్తి కాదు లేదా కరెన్సీ కాదు. కానీ ఇది ఆనందించగల, స్వాధీనం చేసుకోగల ఆస్తి. దీనిపై నమ్మకం ఉంచగల సామర్థ్యం ఉన్న ఆస్తి అని’ జడ్జి పేర్కొన్నారు. జూలై 2024లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై జరిగిన సైబర్ దాడి తర్వాత మహిళకు చెందిన ₹1.98 లక్షల విలువైన 3,532.30 XRP టోకెన్‌లు ఫ్రీజ్ అయ్యాయి. ఈ కేసు పిటిషన్ పై విచారణలో భాగంగా పెట్టుబడిదారు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ తీర్పు వచ్చింది. Ethereum, ERC-20 టోకెన్‌లను లక్ష్యంగా చేసుకున్న ఈ హ్యాకింగ్, సైబర్ దాడి 230 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹1,900) నష్టాన్ని కలిగించిందని, అన్ని ప్లాట్‌ఫారమ్ లలో అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు.

తన XRP హోల్డింగ్‌లు చోరీఅయిన టోకెన్‌లకు భిన్నంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ చట్టం 1996లోని సెక్షన్ 9 కింద వాటిని రక్షించాలని మహిళా పిటిషనర్ వాదించారు. జన్మై ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే వాజిర్‌ఎక్స్ తన నిధులను మళ్లీ డస్ట్రిబ్యూట్ చేయకుండా నిరోధించడానికి చట్టపరమైన రక్షణ కోరింది. అయితే జన్మై ల్యాబ్స్ దాని మాతృసంస్థ జెట్టై ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కోర్టు ఆదేశించిన పునర్నిర్మాణ ప్రక్రియను ఉటంకించింది. ఈ తీర్పులో వినియోగదారులందరూ సమిష్టిగా నష్టాలను భరించాలని కంపెనీ తెలిపింది. కానీ జస్టిస్ వెంకటేష్ ఆ వాదనను తిరస్కరించారు. పెట్టుబడిదారుడి ఆస్తులు ఉల్లంఘనలో భాగం కాదని పేర్కొన్నారు. సైబర్ దాడికి గురైనవి ERC 20 కాయిన్స్, ఇవి దరఖాస్తుదారుడి వద్ద లేని క్రిప్టో కరెన్సీలు అని జడ్జి స్పష్టం చేశారు.

PASL విండ్ సొల్యూషన్స్ వర్సెస్ GE పవర్ కన్వర్షన్ ఇండియా (2021)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ న్యాయస్థానం అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. ఇది భారత కోర్టులు దేశంలోని ఆస్తులను రక్షించడానికి అనుమతి ఇస్తుంది. పెట్టుబడిదారుడి లావాదేవీలు చెన్నైలో ప్రారంభమై, భారత బ్యాంకుకు సంబంధించినవి కనుక.. ఈ కేసు మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది.

జస్టిస్ వెంకటేష్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(47A)ని ప్రస్తావించారు. క్రిప్టోకరెన్సీలను వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా పేర్కొంటూ వాటికి చట్టపరమైన గుర్తింపు అసరమని పేర్కొన్నారు. బలోపేతం చేస్తుంది. స్వతంత్ర ఆడిట్‌లు, క్లయింట్ ఫండ్ విభజన, KYC/AML సమ్మతితో సహా Web3 ప్లాట్‌ఫారమ్‌ల కోసం కఠినమైన నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

క్రిప్టోను చట్టబద్ధంగా ఆస్తిగా గుర్తించడం ద్వారా ఇది డిజిటల్ కరెన్సీ లేదా కేవలం కోడ్ కాదు. న్యాయపరంగా పెట్టుబడిదారుల హక్కులు అమలు చేయడానికి వీలవుతుంది. క్రిప్టో హోల్డింగ్‌లు ఇతర విలువైన ఆస్తుల తరహాలోనే రక్షణ పొందుతాయని తీర్పు స్పష్టం చేసింది.

Tags:    

Similar News