Indian Railways : కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాన్..భారతీయ రైల్వే రూపురేఖలు మార్చనున్న టాటా, స్కోడా
Indian Railways : టాటా ఆటో-కాంప్ సిస్టమ్స్, యూరప్‌లోని ప్రముఖ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తయారీ సంస్థ స్కోడా గ్రూప్ మధ్య కొత్త భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
Indian Railways : కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాన్..భారతీయ రైల్వే రూపురేఖలు మార్చనున్న టాటా, స్కోడా
Indian Railways : టాటా ఆటో-కాంప్ సిస్టమ్స్, యూరప్‌లోని ప్రముఖ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తయారీ సంస్థ స్కోడా గ్రూప్ మధ్య కొత్త భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో రైల్వేలకు ఉపయోగించే ప్రొపల్షన్ టెక్నాలజీ, వాటి భాగాలను తయారు చేయనున్నాయి. ఇందులో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ భాగస్వామ్యం ముఖ్యంగా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే, మొబిలిటీ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. టాటా ఆటో-కాంప్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీలో నైపుణ్యం కలిగి ఉంది. ఇప్పుడు రైల్వే రంగంలోకి కూడా అడుగుపెడుతోంది.
ఈ కొత్త కంపెనీ మెట్రో, మీడియం నుండి హై-స్పీడ్ రైళ్లు, లైట్ రైల్ వెహికల్స్ కోసం డ్రైవ్ సిస్టమ్స్, కన్వర్టర్లు, ఇతర అవసరమైన ఎలక్ట్రిక్ భాగాలను తయారు చేస్తుంది. ఈ తయారీ అంతా భారతదేశంలోనే జరుగుతుంది. ఈ పెట్టుబడి దేశానికి ఆర్థికంగా, సాంకేతికంగా రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం భారతదేశం స్మార్ట్, సస్టైనబుల్ ట్రాన్స్‌పోర్ట్ మిషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా భారతీయ రైల్వే రంగాన్ని దృష్టిలో ఉంచుకొని, తక్కువ ఖర్చుతో మెరుగైన సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాటా ఆటో-కాంప్ తెలిపింది.
టాటా ఆటో-కాంప్ మే నెలలో మెక్సికో కంపెనీ క్యాట్‌కాన్ గ్లోబల్ తో కూడా కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో తేలికైన ఆటోమొబైల్ విడిభాగాలను తయారు చేస్తారు. ఈ భాగస్వామ్యం ఉత్తర అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించింది. ఆటో పరిశ్రమ కోసం థర్మల్ ఇన్సులేషన్, ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఆధునిక మెటీరియల్స్ తయారు చేయడంలో క్యాట్‌కాన్ నిపుణుడు. ఈ రెండు కంపెనీలు గత 10 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో, టాటా ఆటో-కాంప్ జగ్వార్-ల్యాండ్ రోవర్ గ్రూప్ కు చెందిన ఆర్టిఫెక్స్ ఇంటీరియర్ సిస్టమ్స్ లిమిటెడ్లో 80% వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం తర్వాత, ఆర్టిఫెక్స్ ఇప్పుడు టాటా ఆటో-కాంప్ లో భాగమైంది.