ప్రాన్ కార్డు, పాన్ కార్డుకి తేడా తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..!
*ప్రాన్ కార్డు, పాన్ కార్డుకి తేడా తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..!
ప్రాన్ కార్డు, పాన్ కార్డుకి తేడా తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..!
PRAN And PAN card: మీకు ప్రాన్ కార్డు (PRAN)లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాన్ కార్డు (PAN) పది అంకెల సంఖ్య అయినట్లే ప్రాన్ కార్డు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య. ఇది 12 అంకెల సంఖ్య. కానీ రెండింటి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ కార్డును కలిగి ఉండటం అవసరం. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కింద నమోదు చేసుకున్న వ్యక్తులను గుర్తిస్తుంది.
ప్రాన్ నంబర్‌ని పొందిన తర్వాత NPS సబ్‌స్క్రైబర్‌లు ప్రాన్ కార్డ్‌ని పొందే అవకాశం ఉంటుంది. NPSలో ప్రాన్ కార్డు చాలా ముఖ్యమైనది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రాన్ కార్డు కోసం నమోదు చేసుకోవడం అవసరం. దీని కోసం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL)లో నమోదు చేసుకోవచ్చు. ప్రాన్ కార్డు కింద రకాల NPS ఖాతాలు ఉంటాయి. టైర్-I ఖాతా, టైర్-II ఖాతా.
టైర్ 1 ఖాతా విత్ డ్రా చేయలేనిది. ఇది రైటైర్మెంట్ ఫండ్ కోసం ఉద్దేశించినది. టైర్-II ఖాతా పొదుపు ఖాతాను పోలి ఉంటుంది. ఇది మీ పొదుపులను విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. అయితే దీని వల్ల ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు. ప్రాన్ కార్డ్ ఒక విధంగా ప్రత్యేకమైన ID లాగా పనిచేస్తుంది. ఈ కారణంగా చందాదారు దానిని మార్చలేరు. ప్రాన్‌కార్డ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్‌కార్డు
అలాగే బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు వరకు పాన్ కార్డ్ అవసరమవుతుంది. పాన్‌కార్డ్ చెల్లుబాటు అయ్యే పత్రం KYC వలె పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టాలన్నా లేదా బంగారం కొనాలన్నా లేదా మీ గుర్తింపు కోసం ఏదైనా ప్రభుత్వ పథకంలో ఉపయోగించాలన్నా పాన్ కార్డ్ చట్టపరమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.