Aadhaar: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

Aadhaar: ఆథార్ కార్డు లేనిదే బ్యాంక్ అకౌంట్ కాదు క‌దా క‌నీసం సిమ్ కార్డు కూడా ఇవ్వ‌డం లేదు

Update: 2021-06-03 07:09 GMT

ఆధార్ కార్డు ఫైల్ ఫోటో 

Aadhaar: దేశంలో ప్రతి ఒక్క‌రికి ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ఆధార్ కార్డు వ్య‌క్తిగత చిరునామా మాత్రమే కాదు..కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే అనేక ప‌థ‌కాల‌ను ఇది త‌ప్ప‌నిసరి. రేష‌న్ కార్టు ద‌ర్గ‌ర నుంచి బ్యాంకు అకౌంట్ వ‌రుకు అన్నిటికి ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఆథార్ కార్డు లేనిదే బ్యాంక్ అకౌంట్ కాదు క‌దా క‌నీసం సిమ్ కార్డు కూడా ఇవ్వ‌డం లేదు. దీంతో UIDAI ఆధార్ కార్డు ఉన్నవారికి అనేక సేవల్ని అందిస్తోంది. UIDAI ఇటీవల మరో కొత్త సేవ‌ల‌ను ప్రారంభించింది. దేశ పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో వెబ్ సైట్ లోకి వెళ్లి చూస్తే ఓ లింక్ క‌నిపిస్తుంది.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి మీ ఆధార్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయి ఉండాలి. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో తెలుసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా చూడాలో తెలుసుకొండి.AccountAccount

ఆధార్ కార్డ్ క‌లిగిన వారు ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ వెల్లాలి.

ఆ తర్వాత పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయాలి.

ఆ త‌ర్వాత‌ Aadhaar Linking Status పైన క్లిక్ చేయాలి.

మీ ముందు స్క్రీన్ పై కొత్త‌ పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ తర్వాత ఆధార్ 12 సంఖ్య‌ల‌ లేదా వర్చువల్ ఐడీ క్లిక్ చేయాలి

సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయాలి.

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

బ్యాంక్ మ్యాపర్ ద్వారా మీ వివరాలను సేకరిస్తుంది UIDAI.

మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.

బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టీవ్‌గా ఉందో లేదో కూడా చూడొచ్చు.. ఎప్పటి నుంచి ఉందో వివరాలు చూడొచ్చు.

Tags:    

Similar News