Saving: 115 నెలల్లో రూ. 10 లక్షలు మీ సొంతం.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Saving: ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు డబుల్ అయ్యే స్కీమ్స్ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పథకాల్లో కిసాన్ వికాస్ పత్రం ఒకటి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మంచి పొదుపు పథకం ఇది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది.
Saving: 115 నెలల్లో రూ. 10 లక్షలు మీ సొంతం.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Saving: ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు డబుల్ అయ్యే స్కీమ్స్ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పథకాల్లో కిసాన్ వికాస్ పత్రం ఒకటి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మంచి పొదుపు పథకం ఇది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా డబ్బును ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడి రూ.1,000 నుంచి ప్రారంభించవచ్చు. కనిష్ఠ పెట్టుబడి రూ. 1,000కాగా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇది వ్యక్తిగత, జాయింట్ ఖాతాల ద్వారా లేదా మైనర్ పేరుతో కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం KVP పథకంలో పెట్టుబడి చేసిన డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాలు 7 నెలల్లో రెండింతలు అవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే పదవ సంవత్సరం ప్రారంభానికి రూ. 10 లక్షలు లభిస్తుంది.
ప్రస్తుత వడ్డీ రేటు 7.5%గా ఉంది. వార్షికంగా, కాంపౌండ్ పద్ధతిలో లెక్కిస్తారు. వడ్డీ మొత్తాన్ని వార్షికంగా చెల్లించకుండా, స్కీం చివర్లో మొత్తం లాభంతో కలిపి ఇస్తారు. ఇది స్థిరమైన ఆదాయం ఇస్తుంది. ఈ పథకానికి Section 80C క్రింద ట్యాక్స్ మినహాయింపు వర్తించదు. కానీ ఇది పూర్తి భద్రత కలిగిన పెట్టుబడి, భారత ప్రభుత్వ హామీ ఉంటుంది.
18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్వెస్టర్ పేరిట, జాయింట్ ఖాతాగా, లేదా మైనర్ పేరిట ఖాతా ప్రారంభించవచ్చు. కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా భద్రతగా ఉంచాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.