KFC Toothpaste: కేఎఫ్‌సీటూత్ పేస్ట్ చికెన్ లవర్స్ కోసం.. ఎగబడి కొంటున్న జనం

KFC Toothpaste Viral: ఇప్పటివరకు KFC అంటే చికెన్ మాత్రమే అనుకున్నారు. కానీ KFC ఇప్పుడు టూత్ పేస్ట్ ను కూడా అందుబాటులోకి వచ్చింది.

Update: 2025-04-16 15:10 GMT

KFC Toothpaste: కేఎఫ్‌సీటూత్ పేస్ట్ చికెన్ లవర్స్ కోసం.. ఎగబడి కొంటున్న జనం

KFC Toothpaste Viral: KFC టూత్ పేస్టులు ఇప్పుడు నెట్ ఇంట రచ్చ మొదలైంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అని ఇప్పటివరకు యాడ్ చేశారు. కానీ ఇకపై మీ టూత్‌ పేస్ట్‌ KFC చికెన్‌ ఫ్లేవరా? అంటారు. ఈ టూత్ పేస్ట్ ను వినియోగించేవారు ఎక్కువ అవుతున్నారు. అవును ఇది నిజమే KFC కొత్త ఐడియాతో టూత్ పేస్ట్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈనేపథ్యంలో చికెన్ లవర్స్ నుంచి భారీ స్పందన లభిస్తుంది.

ఇలా KFC చికెన్ రుచితో పాటు టూత్ పేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ వినూత్నమైన ఐడియా హిస్మాయిల్ డెంటల్ బ్రాండ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తంగా ఇందులో 11 మసాలాలు కలిపి ఈ KFC టూత్ పేస్ట్ ను తయారు చేశారు. దీంతో నోట్లో పెట్టుకోగానే చికెన్ టెస్ట్ తో పాటు పళ్లు కూడా తోముకుంటారు. కేవలం ప్రారంభించిన 48 గంటల్లోనే చాలామంది కొనుగోలు చేశారు .

సోషల్ మీడియా వేదికగా ఈ టూత్ పేస్ట్ పై భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫింగర్లిక్ ఇన్ గుడ్ అని కామెంట్‌ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ KFC టూత్ పేస్ట్ సంచలనంగా మారింది. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఫ్లోరైడ్ కూడా ఉండదు కాబట్టి దంత ఆరోగ్యానికి కూడా మంచిది . అయితే ఇందులో ఈ KFC బ్రాండ్ కి చెందిన ఒక బ్రాండెడ్ టూత్‌ పేస్ట్‌ కూడా అందులో ఉంది. మొత్తానికి ఈ సరదా ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. KFC లవర్స్ కి ఇది సరికొత్త అనుభవం అని చెప్పొచ్చు. అయితే ఇది కొనుగోలు చేసే ముందు వైద్యులను సంప్రదించడం మేలు.

Tags:    

Similar News