స్మాల్ బిజినెస్ లోన్‌కి అప్లై చేసేటప్పుడు ఇవి గమనించండి.. ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా అవసరం..!
MSME Loan: ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే కచ్చితంగా పెట్టుబడి అవసరమవుతుంది
స్మాల్ బిజినెస్ లోన్‌కి అప్లై చేసేటప్పుడు ఇవి గమనించండి.. ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా అవసరం..!
MSME Loan: ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే కచ్చితంగా పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రారంభించిన వ్యాపారం సజావుగా సాగాలన్నా, ఇంకా అభివృద్ధి చేయాలన్నా ఆర్థిక సహాయం అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారాయి. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) ప్రకారం 2025 నాటికి ఎంఎస్‌ఎంఈ రంగంలో మరో ఐదు కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా.
అయితే ఇతర రంగాల మాదిరిగానే ఎంఎస్‌ఎంఈ రంగంలో కూడా కొన్నిసార్లు ప్రపంచ సమస్యల కారణంగా మాంద్యం కనిపిస్తుంది. ఈ సందర్భాలలో మళ్లీ అవి పుంజుకోవడానికి ఆర్థిక సహాయం అవసరమవుతుంది. వ్యాపార సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి వివిధ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవచ్చు. అయితే MSME రుణం ఎలా తీసుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం.
నిబంధనలు
లోన్ కోసం అప్లై చేయడానికి ముందు వ్యాపారులు తప్పనిసరిగా లోన్ ఆవశ్యకత, ఉద్దేశ్యాన్ని వివరించాలి. లోన్ ఎంతకాలంలో తీర్చుతారో గుర్తించాలి. వారి లక్ష్యం ప్రకారం అవసరమైన మొత్తాన్ని నిర్ణయించాలి. పెద్ద రుణం అధిక వ్యయానికి దారి తీస్తుంది. అయితే చిన్న రుణం వ్యాపారం డిమాండ్లను సరిగ్గా నెరవేర్చదు. కాబట్టి లోన్ మొత్తానికి దరఖాస్తు చేసే ముందు నెలవారీ లోన్ EMI చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయాన్ని లెక్కించి సరైన బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి.
వ్యాపారులు నెలవారీ ఖర్చుతో పాటు అసలు మొత్తం, లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. లోన్ ఆమోదం పొందడానికి బేసిక్ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యాపారులు ముందుగా లోన్ ఫారాన్ని పూర్తి చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించాలి. ఈ పత్రాలలో ID రుజువు, నివాస రుజువు, పాస్‌పోర్ట్, గత ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ ఉండాలి. ఇది కాకుండా గత మూడు నుంచి ఆరు నెలల పే స్లిప్‌లు, గత రెండేళ్ల ఫారం 16, గత రెండు నుంచి మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌తో పాటు కంపెనీ డాక్యుమెంట్‌లు అవసరమవుతాయి.