Jio Super Plan: డైలీ 2 జీబీ డేటా వాడుతారా.. సరసమైన ధరలో జియో సూపర్ ప్లాన్..!
Jio Super Plan: కస్టమర్లను ఆకర్షించడానికి రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంటుంది. ఇందులో అన్నివర్గాల వారికి అనువైన రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి.
Jio Super Plan: డైలీ 2 జీబీ డేటా వాడుతారా.. సరసమైన ధరలో జియో సూపర్ ప్లాన్..!
Jio Super Plan: కస్టమర్లను ఆకర్షించడానికి రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంటుంది. ఇందులో అన్నివర్గాల వారికి అనువైన రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. కొంతమంది డేటా ఎక్కువ ఉపయోగిస్తే మరికొంతమంది డేటా తక్కువ ఉపయోగిస్తారు. ఇద్దరికి సూపర్ ప్లాన్స్ ఉన్నాయి. వాస్తవానికి అన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్‌లు అధిక ధరను కలిగి ఉంటాయి. మీరు సరసమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో ఒక ప్లాన్‌ను కలిగి ఉంది. అది సరసమైనది మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జియో రూ.299 ప్లాన్
జియో రూ.299 ప్లాన్ అత్యంత శక్తివంతమైన రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకటి. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. దీనిని తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందుతారు. మొదటిది ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటా పొందుతారు. 28 రోజుల్లో మొత్తం 56GB డేటా అవుతుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 SMSలను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఆర్థికంగా శక్తివంతమైనది. అయితే డేటా ఎక్కవగా వాడేవారికి ఈ ప్లాన్ బాగా సూటవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో అన్ని టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల ధరతో పోలిస్తే జియో చాలా తక్కువ ధరలో డేటా ప్రయోజనాలను అందిస్తోంది. దీనితో పాటు మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. ఇందులో ఒక సంవత్సరం వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి.