ITR for Deceased: మరణించిన వారి ITR ఎందుకు ఫైల్ చేయాలి? ఎవరు చేయాలి?

ITR for Deceased: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి దీనిని పూర్తి చేయాలి. అయితే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి ITRను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

Update: 2025-07-11 02:58 GMT

ITR for Deceased: మరణించిన వారి ITR ఎందుకు ఫైల్ చేయాలి? ఎవరు చేయాలి?

ITR for Deceased: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి దీనిని పూర్తి చేయాలి. అయితే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి ITRను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మరణించిన వ్యక్తి కుటుంబానికి లేదా వారసులకు ట్యాక్స్ నోటీసులు కూడా రావొచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో మరణిస్తే, ఆ సంవత్సరం వారు ట్యాక్సబుల్ ఇన్‌కమ్ సంపాదించినట్లయితే, వారు చనిపోయినప్పటికీ ఆ సంవత్సరం ITR ఫైల్ చేయడం తప్పనిసరి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దీనిని ఇన్‌కమ్ బిఫోర్ డెత్ గా పరిగణిస్తుంది.

మరణించిన వారి తరఫున ITR ఎవరు ఫైల్ చేస్తారు?

మరణించిన వ్యక్తి తరఫున ITR ఫైల్ చేసే బాధ్యత లీగల్ హీర్ లేదా చట్టపరమైన వారసుడిపై ఉంటుంది. ఈ వారసుడు సాధారణంగా కుటుంబ సభ్యుడు కావచ్చు, ఉదాహరణకు భార్య, భర్త, కొడుకు, కూతురు లేదా దగ్గరి బంధువు ఎవరైనా కావచ్చు.

ITR ఫైల్ చేసే ప్రక్రియ

1. చట్టపరమైన వారసుడిని గుర్తించాలి

ముందుగా, మరణించిన వ్యక్తికి చట్టపరమైన వారసుడు ఎవరో గుర్తించడం చాలా ముఖ్యం. దీని కోసం మరణ ధృవీకరణ పత్రం, బంధుత్వం రుజువు (ఉదాహరణకు ఆధార్ కార్డ్, ఫ్యామిలీ రిజిస్టర్ మొదలైనవి) సమర్పించాలి.

2. ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

చట్టపరమైన వారసుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో తమను తాము రిప్రజెంటేటివ్ అసెసీ గా నమోదు చేసుకోవాలి.

3. డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి

నమోదు చేసుకునేటప్పుడు, మీరు మరణించిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, వారసుడు అని నిరూపించడానికి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

4. ఆమోదం వచ్చాక ITR ఫైల్ చేయాలి

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మీ గుర్తింపును ఆమోదించిన తర్వాత, మీరు మరణించిన వ్యక్తి తరఫున, వారు మరణించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR ను ఫైల్ చేయవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

ఒక వ్యక్తి మార్చి 31లోపు మరణిస్తే, వారి ఆదాయం పన్ను పరిమితిని దాటినట్లయితే, ఆ సంవత్సరానికి ITR ఫైల్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మరణించిన వ్యక్తికి ట్యాక్సబుల్ ఇన్‌కమ్ లేకపోతే, ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా ITR ఫైల్ చేయడం తప్పనిసరి.

Tags:    

Similar News