Stock Market Courses: స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉందా.. ఈ కోర్సులు చేస్తే బెస్ట్ ఆదాయం..!
Stock Market Courses: స్టాక్ మార్కెట్ వేగంగా విస్తరించడం వల్ల ఈ రంగంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి.
Stock Market Courses: స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉందా.. ఈ కోర్సులు చేస్తే బెస్ట్ ఆదాయం..!
Stock Market Courses: స్టాక్ మార్కెట్ వేగంగా విస్తరించడం వల్ల ఈ రంగంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. నేటి రోజుల్లో యువత షేర్ మార్కెట్‌ను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. తద్వారా తక్కువ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు. కొంతమంది ఈ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ రంగంలో చాలా వృద్ధి ఉంది. మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ఇంటర్, లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మెరుగైన కెరీర్ చేయాలంటే ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. మార్కెట్‌లో షేర్ మార్కెట్ అధ్యయనానికి సంబంధించిన కొన్ని కోర్సులు ఉన్నాయి. వీటిలో అడ్మిషన్ తీసుకోవడం వల్ల నైపుణ్యాలను పొందుతారు. ఇది భవిష్యత్‌లో వ్యాపారం లేదా ఉద్యోగం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంటర్‌తో డిప్లొమా కోర్సు
12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత షేర్ మార్కెట్‌కు సంబంధించిన కోర్సులు చేయవచ్చు. అయితే డిగ్రీ కంటే ఈ రంగంలో ఆసక్తి ముఖ్యం. దేశంలోని అనేక ప్రైవేట్ సంస్థలు ఇలాంటి కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులో, మీకు స్టాక్ మార్కెట్, ఇన్‌క్లూజన్ థియరీ, ప్రాక్టికల్, ఫండమెంటల్, టెక్నికల్ ఇన్‌ఫర్మేషన్‌కు సంబంధించిన అన్ని బేసిక్ విషయాలు బోధిస్తారు.
కోర్సు ఫీజు
సమాచారం ప్రకారం స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ఏదైనా కోర్సు చేయాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కెరీర్ ప్రారంభంలో మీరు నెలకు రూ. 35 నుంచి 40 వేల వరకు సంపాదించవచ్చు. అనుభవం, సమయం పెరిగే కొద్దీ నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
NSE అకాడమీ కోర్సులు
సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ (NCMP) కోర్స్
సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ - NCFM
NCFM ఫౌండేషన్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్ కోర్స్
NSE ఫిన్‌బేసిక్ కోర్స్
సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ NCMP కోర్సు
ప్రొఫిషియెన్సీ సర్టిఫికేట్
NIFM కోర్సులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ 1993 సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇందులో ప్రవేశం పొందాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ నుంచి విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చేయవచ్చు.