3నుంచి 5 సంవత్సరాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి సాధనాలలో ఒకటి.

Update: 2021-12-02 05:55 GMT

3నుంచి 5 సంవత్సరాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..? (ఫైల్ ఇమేజ్)

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి సాధనాలలో ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఆర్థిక లక్ష్యం ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకొని చేయాలి. దీని ఆధారంగా మీరు FDలో పొదుపు చేయడం ప్రారంభించాలి. మీరు బ్యాంకును సందర్శించడం ద్వారా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా కూడా సులభంగా FD ఖాతాను తెరవవచ్చు. చాలా బ్యాంకులు సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 0.5% వరకు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.75% వరకు ఉండవచ్చు. FDలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను తెలుసుకోవడం మంచిది. మీరు 3 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధితో FDలలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే భారతదేశంలోని కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల జాబితా తెలుసుకోండి.

ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 3-5 సంవత్సరాల FDలపై 4.9 శాతం వడ్డీని ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 5.25 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా 3-5 సంవత్సరాల FDలపై 5.05 శాతం వడ్డీని ఇస్తోంది. కెనరా బ్యాంక్ 5.35 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం, ఇండియన్ బ్యాంక్ 5.25 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.2 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.25%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 5.3 శాతం, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 5.4%, యూకో బ్యాంక్ 5.05 శాతం, యూనియన్ బ్యాంక్ 5.4 శాతం, J&K బ్యాంక్ 5.3 శాతం, కర్ణాటక బ్యాంక్ 5.4 శాతం, కోటక్ బ్యాంక్ 5.3 శాతం చెల్లిస్తున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ 3-5 సంవత్సరాల FDలపై 5.75 శాతం వడ్డీని ఇస్తోంది. RBL బ్యాంక్ 6.3, సౌత్ ఇండియన్ బ్యాంక్ 5.65, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 5, TNSC బ్యాంక్ 6, యెస్ బ్యాంక్ 6.25 శాతం చెల్లిస్తున్నాయి.

యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం, బంధన్ బ్యాంక్ 5.25%, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ 5.5, సిటీ యూనియన్ బ్యాంక్ 5, డీసీబీ బ్యాంక్ 5.95, ధనలక్ష్మి బ్యాంక్ 5.4, ఫెడరల్ బ్యాంక్ 5.6, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 5.3, ఐసిఐసిఐ బ్యాంక్ 5.35, ఐడిబిఐ బ్యాంక్ 5.4 ఎఫ్‌డిబిఐ 5.4 సంవత్సరాల్లో IDFC ఫస్ట్ బ్యాంక్ 6, ఇండస్ఇండ్ బ్యాంక్ 6 శాతం వడ్డీని ఇస్తున్నాయి. వడ్డీ రేట్లు నవంబర్ 25 నాటికి బ్యాంకుల వెబ్‌సైట్ నుంచి తీసుకోబడ్డాయని గుర్తించండి. 

Tags:    

Similar News