Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నివసించే ఇంటి ధర ఎంతో తెలుసా?

Infosys Narayana Murthy Sky Mansion: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అత్యంత ధనిక వ్యాపారవేత్త అని చెప్పొచ్చు. బెంగళూరులో ఈయనకు ఒక అద్దాలమేడ ఉంది. దీని విలువ ఎంతో తెలుసా?

Update: 2025-04-16 13:46 GMT

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నివసించే ఇంటి ధర ఎంతో తెలుసా?

Infosys Narayana Murthy Sky Mansion in Bangalore

Infosys Narayana Murthy Sky Mansion: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అత్యంత ధనిక వ్యాపారవేత్త. ఈయన ఎంతో సాధారణ జీవితం గడుపుతున్న నారాయణమూర్తి ఇల్లు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోవాల్సిందే. అయితే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నివసిస్తున్న ఇల్లు బెంగళూరులో ఉంది. దాని పేరు కింగ్ ఫిషర్ టవర్ ఈ అద్దాలమేడ నాలుగు అంతస్తులు కలిగి ఉంది. ఆయన ఈ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అంబానీ గురించి మాత్రమే చెప్పుకున్నాం. కానీ ఇన్ఫోసిస్ నారాయణ ఇల్లు ధర ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా?

ఈ 34 అంతస్తులు అద్దాల మేడం బెంగళూరులోని యూబీ సిటీలో ఉంది. ఈ ఇంటిని ప్రెస్టేజ్ యునైటెడ్ బ్రూవరీస్ సంయుక్తంగా నిర్మాణం చేపట్టాయి. అయితే ఇది 2010లో ప్రాజెక్టును చేపట్టారు. అప్పుడు చదరపు అడుగు రూ. 22 వేలు మాత్రమే కానీ ఇప్పుడు ఎంతో ఖరీదుగా మారింది. ఈ కింగ్‌ఫిషర్ టవర్ 16 అంతస్తు అత్యంత ప్రత్యేక ఎందుకంటే 400 చదరపు అడుగులో నిర్మించారు. అక్కడ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నివసిస్తారు. అంటే చదరపు అడుగుకి రూ.59,500 ఖర్చు అయింది. అంటే మొత్తంగా రూ.50 కోట్లకు పైగా అప్పట్లోనే ఖర్చయిందని చెబుతారు

ఈ స్కై మాన్షన్ లో కేవలం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాత్రమే కాదు. దాదాపు 80 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఈ భవనంలో సుధా మూర్తి కూడా 23వ అంతస్తులో ఉంటుంది. ఆ కింగ్‌ఫిషర్ టవర్ రూ.28 కోట్లకు కొనుగోలు చేశారు. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా అదే టవర్ లో ఉంటున్నాడు. ఈయన అపార్ట్‌మెంట్ 7000 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇక రానా జార్జ్ అపార్ట్‌మెంట్ రూ.35.16 కోట్లకు కొనుగోలు చేశాడు. అయితే విజయ్ మాల్యా స్కై మాన్షన్ మాత్రం రూ. 165 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

విజయ్ మాల్యాకు సంబంధించిన ఈ భవనం ఇతర అపార్ట్‌మెంట్ లకు భిన్నంగా 4 వేల స్క్వేర్ ఫీట్లలో వైట్ హౌస్ పోలి ఉండే విధంగా నిర్మాణం చేపట్టారు. ఇందులో స్విమ్మింగ్ పూల్ తో పాటు హెలిప్యాడ్ తో మంచి గార్డెన్ తో అందంగా ఉంది. ఈ ఖరీదైన భవనంలో విజయ్ మాల్యా మాత్రం నివసించడం లేదు ఆయనపై కేసు నిమిత్తం యూకే వెళ్లిపోయారు. భారత్‌లో చీటింగ్ కేసు నమోదు అయింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఇందులో ఒకసారి కూడా విజయ్ మాల్యా అడుగు కూడా పెట్టలేదు.

Tags:    

Similar News