Indigo Monsoon Sale: బస్ టికెట్ ధరల్లో ఇప్పుడు విమానం ధరం.. ఇండిగో మాన్సూన్ సేల్
Indigo Monsoon Sale: విమాన ప్రయాణాలు చేసేవారికి ఇండిగో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రతి ఏటా అందించే మాన్సూన్ సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్‌లో బస్సు టికెట్లు ధరల్లోనే విమాన టికెట్లు ఉన్నాయి.
Indigo Monsoon Sale: బస్ టికెట్ ధరల్లో ఇప్పుడు విమానం ధరం.. ఇండిగో మాన్సూన్ సేల్
Indigo Monsoon Sale: విమాన ప్రయాణాలు చేసేవారికి ఇండిగో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రతి ఏటా అందించే మాన్సూన్ సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్‌లో బస్సు టికెట్లు ధరల్లోనే విమాన టికెట్లు ఉన్నాయి. దీంతో సమాన్య ప్రజలు కూడా ఇప్పుడు విమాన ప్రయాణం చేయొచ్చు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గోల్డెన్ ఛాన్స్ అందిస్తోంది. తన ప్రయాణికుల కోసం మాన్సూన్ సేల్‌ని తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు బస్ టికెట్ ధరకే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. అంతేకాదు, ఈ సేల్ కింద మీరు దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లను కూడా చాలా తక్కువ రేట్లలో పొందుతారు. దీంతోపాటు ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిస్కౌంట్ ఛార్జీలను అందిస్తోంది.
ఈ సేల్ జులై 15 నుంచి జులై 18 వరకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ని మీరు వినియోగించుకోవాలంటే ఒక వారం వ్యవధి గల విమానాన్ని బుక్ చేసుకోవాలి. అంటే మీరు ఈ సేల్ కింద జులై 22, సెప్టెంబర్ 21 మధ్య ఉన్న విమానాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇక ఛార్జీల విషయానికొస్తే..
మన్సూన్ ఆఫర్ కింద దేశీయ, అంతర్జాతీయ వన్ వే ఛార్జీలు రూ. 1,499 నుంచి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ టిక్కెట్లు కేవలం రూ.4,399 నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాదు కస్టమర్లు ఇండిగో స్ట్రెచ్‌కి అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో అదనపు లెగ్ రూమ్, అదనపు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఛార్జీలు రూ. 9,999 నుంచి ప్రారంభమవుతాయి. దీనితో పాటు అనేక ఇతర ఆఫర్‌లు ఇండిగో అందిస్తోంది.
ఈ ఆఫర్ మీరు పొందాలంటే..
ప్రతి ఒక్కరికి ఈ మాన్సూన్ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ఇండిగో వెబ్ సైట్, మొబైల్ యాప్, విమానాశ్రయ టికెట్ కార్యాలయాలు, కాల్ సెంటర్ల ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. అక్కడే వివరాలు తెలుసుకుని మీరు వెళ్లే విమానానికి అతి తక్కువ ధరలో టికెట్ బుక్ చేసుకోవచ్చు.