Indian Railways: రైలులో పార్సిల్ పంపించాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వేలు దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరుగాంచాయి. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచంలో అతిపెద్ద ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇండియ‌న్ రైల్వే ఒక‌టి. ప్ర‌తీ రోజూ ల‌క్ష‌ల మంది రైళ్ల‌లో త‌మ గ‌మ్య స్థానాల‌కు చేరుకుంటున్నారు.

Update: 2025-06-16 06:10 GMT

Indian Railways: భారతీయ రైల్వేలు దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరుగాంచాయి. ఆ మాట‌కొస్తే ప్ర‌పంచంలో అతిపెద్ద ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇండియ‌న్ రైల్వే ఒక‌టి. ప్ర‌తీ రోజూ ల‌క్ష‌ల మంది రైళ్ల‌లో త‌మ గ‌మ్య స్థానాల‌కు చేరుకుంటున్నారు.

ఇది కేవలం ప్రయాణీకుల రవాణాకే కాదు, వాణిజ్య సరుకుల రవాణా ద్వారా కూడా అధిక ఆదాయాన్ని సంపాదిస్తోంది. ప్రతిరోజూ వేలాది టన్నుల వస్తువులు పార్శిల్ రైళ్లు, ఫ్రెయిట్ రైళ్లు ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.

చిన్నపాటి సామాను నుంచి పెద్దబరువైన వస్తువుల వరకు… రైల్వే ద్వారా పార్శిల్ పంపడం చాలా సులభం. రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో, దీన్ని చాలామంది ఎంపిక చేస్తుంటారు. అయితే పార్సిల్ బుకింగ్ ప్ర‌క్రియ ఎలా ఉంటుంది.? ఛార్జీలు ఎలా ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

మీరు ఒక వస్తువును రైలు ద్వారా పంపాలనుకుంటే, ముందుగా సమీప రైల్వే స్టేషన్‌లోని పార్సిల్‌ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ వస్తువు బరువు, గమ్యస్థానం, రవాణా రకం (వ్యక్తిగత / వాణిజ్య) వంటి వివరాలను ఇవ్వాలి. తరువాత మీరు వస్తువును స్టేషన్‌కు తీసుకెళ్లి, ఫార్వార్డింగ్ లెటర్ పూర్తి చేసి, బరువును ఆధారంగా ఛార్జీలు చెల్లించాలి.

ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం

రైల్వే పార్సిల్‌ సేవలను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేల అధికారిక వెబ్‌సైట్ https://parcel.indianrail.gov.in ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల మీరు ఇంటి వద్ద నుంచే మీ పార్సిల్ సేవ‌ల‌ను బుకింగ్ చేసుకుని, ఖర్చు ముందుగానే అంచనా వేసుకోవచ్చు.

ఛార్జీలు ఎలా లెక్కిస్తారు.?

రైల్వే పార్సిల్ రవాణా ఛార్జీలు రెండు అంశాల ఆధారంగా నిర్ణ‌యిస్తారు. పార్సిల్ బరువు (కిలోలలో), దూరం (కిలోమీటర్లలో). ఉదాహరణకు మైసూర్ నుంచి హైదరాబాద్ వరకు 100 కిలోల బరువు గల పార్సిల్‌ పంపితే, మీకు సుమారు రూ. 418 వరకు ఖర్చవుతుంది. ఇందులో స్టాండర్డ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు వగైరా ఉండవచ్చు. పూర్తి చార్ట్‌కు సంబంధించి వివరాలు రైల్వే వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

బైక్, గృహోపకరణాల రవాణా కూడా

కేవలం చిన్న పార్సిల్ల‌కు మాత్రమే కాకుండా, బైకులు, ఫర్నిచర్‌, గృహోపకరణాల వంటి పెద్ద సామానులకూ వర్తిస్తుంది. త‌క్కువ ఖ‌ర్చులో సామాన్లు షిఫ్ట్ చేసుకునే వారికి ఇండియ‌న్ రైల్వే బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News