Indian railways luggage policy: రైలు ప్రయాణికులకు లగేజీ పరిమితులు... ఎన్ని కేజీలు ఉచితం? ఎప్పుడు ఫైన్ వేస్తారు?
Indian railways luggage policy: రైలు ద్వారా దూర ప్రయాణాలు చేసే వారి కోసం ఇండియన్ రైల్వే కీలక మార్గదర్శకాలు పాటిస్తోంది. ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తూ, ఆ మించితే జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించాయి.
Indian railways luggage policy: రైలు ప్రయాణికులకు లగేజీ పరిమితులు... ఎన్ని కేజీలు ఉచితం? ఎప్పుడు ఫైన్ వేస్తారు?
Indian railways luggage policy: రైలు ద్వారా దూర ప్రయాణాలు చేసే వారి కోసం ఇండియన్ రైల్వే కీలక మార్గదర్శకాలు పాటిస్తోంది. ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తూ, ఆ మించితే జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించాయి. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణించే వారు తప్పకుండా లగేజీ పాలసీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
తరగతి ఆధారంగా ఉచిత లగేజీ పరిమితి:
ఫస్ట్ క్లాస్ ఏసీ (AC First Class): గరిష్ఠంగా 70 కిలోల వరకూ ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
ఏసీ 2-టైర్ (AC 2-Tier): 50 కిలోల వరకు అనుమతి.
ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ (AC 3-Tier, Sleeper Class): 40 కిలోల వరకూ ఉచితం.
సెకండ్ క్లాస్ (Second Class): కేవలం 35 కిలోల వరకూ మాత్రమే ఉచితం.
5 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలు: లగేజీ పరిమితికి అర్ధంగా మాత్రమే అనుమతి.
అధిక లగేజీపై రుసుము:
అధిక బరువు ఉన్న వస్తువులు, టీవీలు, పెద్ద సూట్‌కేసులు తీసుకెళ్తే రైల్వే అధికారులు తనిఖీ చేసి అదనపు రుసుము వసూలు చేయొచ్చు. ప్రయాణానికి ముందు 30 నిమిషాల ముందు లగేజీ కౌంటర్‌ను సంప్రదించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
చేతి సామానుపై మినహాయింపు: హ్యాండ్‌బ్యాగులు, టిఫిన్ బాక్సులు, చేతి కర్రలు వంటివి సాధారణంగా లగేజీ పరిమితి నుంచి మినహాయింపుగా పరిగణిస్తారు.
తనిఖీలు జరుగుతాయా?: సాధారణంగా రైల్వేలు లగేజీపై కఠిన తనిఖీలు చేయకపోయినా, ముఖ్యమైన స్టేషన్లలో ఇదిప్పుడు కఠినంగా అమలవుతోంది. ప్రయాణికుల లగేజీ ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే, టీటీఈ (TTE) దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు.
సూచన: రైల్వే ప్రయాణంలో చికాకులు ఎదుర్కొనకుండా ఉండేందుకు, ప్రయాణానికి ముందు మీ లగేజీ బరువును ఒకసారి తనిఖీ చేసుకోవడం మేలని రైల్వే శాఖ తెలిపింది.