Bank Holidays June 2023: జూన్‌లో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. పూర్తి జాబితా ఇదే..!

Bank Holidays in June 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం.. జూన్‌లో 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి.

Update: 2023-05-24 14:04 GMT

Bank Holidays June 2023: జూన్‌లో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. పూర్తి జాబితా ఇదే..!

Bank Holidays in June 2023: మీకు బ్యాంక్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులు ఏమైనా ఉన్నాయా.. అంటే ఖాతా తెరవడం, చెక్ బుక్ తీసుకోవడం, లోన్ తీసుకోవడం మొదలైనవి. అలా అయితే, ఈ పనులను మే నెలలో మిగిలిన రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జూన్‌లో రాబోయే బ్యాంక్ సెలవుల కారణంగా మీ పనిలో కొంతమేర ఆటంకం కలగవచ్చు. అందువల్ల, మీరు జూన్‌లో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉన్నప్పటికీ, బ్యాంకు సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆన్‌లైన్‌లో అనేక పనులు జరుగుతున్నప్పటికీ బ్యాంకుకు సంబంధించిన అనేక పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. కాబట్టి ఈసారి జూన్ 2023లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జూన్ 2023లో బ్యాంకుల సెలవులు..

జూన్ 4 - ఈ రోజు ఆదివారం. దీని కారణంగా దేశం మొత్తం బ్యాంకుల్లో సెలవు ఉంటుంది.

జూన్ 10- ఈ రోజు నెలలో రెండవ శనివారం. దీని కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూన్ 11- ఈ రోజు ఆదివారం కారణంగా సెలవు.

జూన్ 15 - ఈ రోజు రాజా సంక్రాంతి. దీని కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు.

జూన్ 18- ఈ రోజు ఆదివారం సెలవు.

జూన్ 20- ఈ రోజున రథయాత్ర జరుగుతుంది. కాబట్టి ఒడిశా, మణిపూర్‌లో సెలవు.

జూన్ 24- ఈ రోజు జూన్ చివరి, నాల్గవ శనివారం కావడంతో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జూన్ 25- బ్యాంకులకు ఆదివారం సెలవు.

జూన్ 26- ఖర్చీ పూజ కారణంగా ఈ రోజు త్రిపురలో మాత్రమే బ్యాంకులకు సెలవు.

జూన్ 28- ఈద్ ఉల్ అజా కారణంగా మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, కేరళలో బ్యాంకులకు సెలవు.

జూన్ 29- ఈద్-ఉల్-అజా కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

జూన్ 30 - ఈద్-ఉల్-అజా సెలవుల కారణంగా మిజోరం, ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.

మొత్తం 12 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

RBI సెలవు జాబితా..

వివిధ రాష్ట్రాల్లో పండుగలు, శని, ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులకు మొత్తం 12 రోజుల సెలవులు ఉన్నాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

ఆయా రాష్ట్రాల ప్రకారం బ్యాంకులకు సెలవులు..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, అన్ని రాష్ట్రాలకు సెలవుల జాబితా భిన్నంగా ఉంటుంది. ఈ సెలవుల పూర్తి జాబితా RBI అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిలో రాష్ట్రాల ప్రకారం వివిధ పండుగలు, సెలవుల పూర్తి వివరాలు అందించారు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో ఈజీ..

బ్యాంకులు మూతపడినా ఖాతాదారులకు ఇబ్బందులు ఉండవు. సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సహాయంతో ప్రజలు తమ పనులన్నీ చేసుకోవచ్చు. అందుకే సెలవుల్లో కూడా ఇంట్లో కూర్చొని ఎన్నో బ్యాంకింగ్ పనులు చేసుకోవచ్చు.

Tags:    

Similar News