ఇండియా పోస్ట్ పేమెంట్‌ ఖాతాదారులకు షాక్.. త్వరలో లావాదేవీలన్నీ ఖరీదు..

*దేశంలో పెరిగిన ద్రవ్యోల్భణం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. *పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఇప్పటికే మండిపోతున్నాయి

Update: 2021-12-18 05:27 GMT

ఇండియా పోస్ట్ పేమెంట్‌ ఖాతాదారులకు షాక్.. త్వరలో లావాదేవీలన్నీ ఖరీదు..(ఫైల్-ఫోటో)

IPBP: దేశంలో పెరిగిన ద్రవ్యోల్భణం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఇప్పటికే మండిపోతున్నాయి. దాదాపు లీటర్‌కి వంద రూపాయలు దాటింది. ఇటీవల టమోట రేటు సామాన్యుల నడ్డి విరిచింది. గ్యాస్‌ రేట్లు అధిక ధర పలుకుతున్నాయి. ఇప్పుడు జనవరి 1 నుంచి బ్యాంకు లావీదేవీల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అన్ని బ్యాంకులు ధరలు పెంచినా ఇండియన్‌ పోస్ట్ పేమెంట్‌ ఎప్పుడు పెంచలేద.

కానీ ఈ దపా ఈ బ్యాంకు కూడా వీటిలిస్టులో చేరిపోయింది. సామాన్యుల దగ్గర ఫైన్‌ వసూలు చేసేందుకు సిద్దమైంది. జనవరి 1, 2022 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తన సేవల కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించడం ప్రారంభిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రాథమిక సేవింగ్స్ ఖాతా నుంచి ప్రతి నెల గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి విత్‌డ్రాపై మీకు ఛార్జీ విధిస్తుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లోని సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా నుంచి ప్రతి నెలా 25 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఒక నెలలో గరిష్టంగా 25 వేల రూపాయలు విత్‌డ్రా చేస్తే ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పరిమితి దాటిన తర్వాత ప్రతి విత్‌డ్రాపై రూ. 25 వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీపై జీఎస్టీని ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ATM ఉపసంహరణ, RTGS, NEFT, ఆన్‌లైన్ బదిలీ, EMI లావాదేవీ ఏవైనా సరే ఛార్జీ చెల్లించాల్సిందే.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం మాత్రమే కాదు ఖాతాలో డబ్బు జమ చేసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అవును ఇండియా పోస్ట్ ఖాతాదారులు నెలలో 10 వేల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయగలరు.

రూ.10,000 పరిమితి దాటిన తర్వాత ఒక్కో డిపాజిట్‌పై రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పరిమితి దాటిన తర్వాత ఛార్జ్‌పై GST కూడా విధిస్తారు. ఒకవేళ మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లయితే డబ్బును డిపాజిట్ చేయడం, విత్‌ డ్రా చేయడం అవసరమున్నప్పుడే చేయండి. 

Tags:    

Similar News