Post Office: ఈ పోస్టాఫీసు స్కీంలో 5 లక్షలకి 10 లక్షల రాబడి.. రెట్టింపు ప్రయోజనం..!

Post Office: పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం. మంచి ఆదాయంతో పాటు మీ డబ్బుకి భద్రత కూడా లభిస్తుంది.

Update: 2023-05-25 08:15 GMT

Post Office: ఈ పోస్టాఫీసు స్కీంలో 5 లక్షలకి 10 లక్షల రాబడి.. రెట్టింపు ప్రయోజనం..!

Post Office: పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం. మంచి ఆదాయంతో పాటు మీ డబ్బుకి భద్రత కూడా లభిస్తుంది. పోస్టాఫీసు టైం డిపాజిట్‌ స్కీంలో 5 లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల 10 లక్షలు పొందుతారు. ఇందులో మీరు చక్రవడ్డీ ప్రయోజనం పొందుతారు. ఏప్రిల్ 1, 2023 తర్వాత 7.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీకి రూ.7,24,974 పొందుతారు. ఇందులో వడ్డీగా రూ.2,24,974 లభిస్తుంది. మిగిలిన రూ. 5 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం.

10 సంవత్సరాలలో రెట్టింపు

మీరు పెట్టుబడిని మెచ్యూరిటీని 5 సంవత్సరాలు పొడిగిస్తే రూ. 5 లక్షలకు బదులుగా రూ.10 లక్షలు పొందుతారు. ఈ డబ్బు పదేళ్లలో రూ.10,51,175 అవుతుంది. ఇందులో వడ్డీ మొత్తం రూ.5,51,175 అవుతుంది. ఇక్కడ 10 సంవత్సరాలలో మీ డబ్బుకు రెట్టింపు హామీ లభిస్తుంది. ఈ పథకంలో రూ. 100 గుణిజాలలో పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ TDలో పెట్టుబడి పరిమితి లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపులపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.

పథకం ప్రత్యేకతలు

1. మీరు సమీప పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవాలి.

2. ఈ పథకంలో రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి మొత్తం నిర్ణయించలేదు.

3. 10 ఏళ్లు పైబడిన వ్యక్తి మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

4. మైనర్ పిల్లల ఖాతా అతని తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది.

5. ఈ పథకంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.

6. ఒకేఖాతా, ఉమ్మడి ఖాతా కూడా ఓపెన్‌ చేయవచ్చు.

7. పోస్టాఫీసు పథకంలో పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందుతారు.

Tags:    

Similar News