PM Kisan: పీఎం కిసాన్‌ యోజనలో మొబైల్‌ నంబర్‌ ఎలా అప్‌డేట్‌ చేయాలి? 20వ విడుత నిధులు ఎప్పుడు?

PM Kisan 20th Installment: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (PM Kisan) ద్వారా రైతులు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం పొందుతున్నారు. అయితే, ఈ లబ్ది పొందాలంటే ముందుగా మీ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయాలి.

Update: 2025-03-15 07:32 GMT

PM Kisan: పీఎం కిసాన్‌ యోజనలో మొబైల్‌ నంబర్‌ ఎలా అప్‌డేట్‌ చేయాలి? 20వ విడుత నిధులు ఎప్పుడు?

PM Kisan 20th Installment: పీఎం కిసాన్‌ నిధులు మీరు కూడా పొందాలంటే ముందుగా రిజిస్టర్‌ చేసుకని కేవైసీ పూర్తి చేసుకోవాలి. అప్పుడే నిధులు మీ ఖాతాల్లో జమా అవుతాయి. అయితే, ఫిబ్రవరి 24వ తేదీ 19వ విడుత పీఎం కిసాన్‌ నిధులు జమా అయ్యాయి. మరి 20వ విడుత నిధులు ఎప్పుడు పడతాయి. దీనికి ముందు మీరు పూర్తి చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ నిధి యోజనను 2019లో ప్రారంభించింది. ముఖ్యంగా చిన్నసన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు 20వ విడుత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అవి జూన్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ముందుగా భూ రికార్డులతో రిజిస్టర్‌ చేసుకోవాలి. అంతేకాదు ఇకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. మీ మొబైల్‌ నంబర్‌ కూడా బ్యాంకు ఖాతాకు లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఈ యోజన కింద మీరు మొబైల్‌ నంబర్‌ ఎలా అప్‌డేట్‌ చేయాలి తెలుసుకుందాం.

pmkisan.in అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. అందులో 'ఫార్మర్‌ కార్నర్‌' కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. అక్కడ మీరు మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆధార్‌ నంబర్‌ కూడా ఎంటర్‌ చేయవచ్చు. ఆధార్‌ లేకపోతే మొబైల్‌ నంబర్‌ అప్డ్‌ట్‌ చేయాలి. క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి కొత్త మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

ఈ ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమా చేస్తుంది. మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున జమా చేస్తారు. 2024 అక్టోబర్‌ 5న పీఎం కిసాన్‌ 18వ విడుత నిధులు మంజూరు చేశారు. 2025 ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు విడుదల చేశారు. ఇదిలా ఉండగా 20వ విడుత నిధులు జూన్‌ మాసంలో విడుదల అవుతాయని తెలుస్తోంది.

Tags:    

Similar News