రాంగ్ నెంబర్‌కి యూపీఐ పేమెంట్ చేస్తే ఏం చేయాలి?
ఫోన్ పే, గూగుల్ పేతో పాటు డిజిటల్ పేమేంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటినే ఉపయోగిస్తున్నారు.
రాంగ్ నెంబర్‌కి యూపీఐ పేమెంట్ చేస్తే ఏం చేయాలి?
ఫోన్ పే, గూగుల్ పేతో పాటు డిజిటల్ పేమేంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటినే ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు బ్యాంకు మన చేతిలో ఉన్నట్టే. డిజిటల్ పేమేంట్స్ చేసే సమయంలో పొరపాటున ఒకరికి బదులుగా మరొకరికి డబ్బులు పంపితే ఆ డబ్బులను ఎలా రాబట్టుకోవాలి? దీనికి ఎవరిని సంప్రదించాలి? పోయిన డబ్బు తిరిగి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
డిజిటల్ పేమెంట్స్ జరిపిన సమయంలో దీనికి సంబంధించిన వివరాలు మనకు కన్పిస్తాయి.దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోని జాగ్రత్త చేసుకోవాలి. మీరు ఉపయోగించిన యాప్ నకు సంబంధించిన కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయాలి.ఒకరికి బదులుగా మరొకరికి డబ్బులు పంపిన లావాదేవీలకు సంబంధించిన స్కీన్ షాట్ ను కస్టమర్ కేర్ కు పంపాలి. దీని ఆధారంగా కస్టమర్ కేర్ సిబ్బంది మీ డబ్బు తిరిగి రీఫండ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ కస్టమర్ కేర్ నుంచి సరైన సాయం అందకపోతే NPCI పోర్టల్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ పోర్టల్ లో యూపీఐ సెక్షన్ లో పూర్తి వివరాలు నమోదు చేయగానే ఫిర్యాదు నమోదౌతోంది.
దీంతో పాటు బ్యాంకులో కూడా దీనిపై ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ అడిగిన వివరాలు అందిస్తే రీఫండ్ కోసం బ్యాంకు అధికారులు ప్రాసెస్ మొదలుపెడతారు. పొరపాటున నగదు బదిలీ అయిన ఖాతాదారుడిని సంప్రదించి డబ్బును తిరిగి పంపాలని కోరాలి. ఆ ఖాతాదారుడు ఇందుకు నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. దీనితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1800 120 1740 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.ఈ మార్గాల ద్వారా కూడా డబ్బు తిరిగి రాకపోతే ఆర్ బీ ఐ కి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.