Housing plots: కరోనా తర్వాత ఫ్లాట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ప్రాప్ ఈక్విటీ నివేదిక

Housing plots: కరోనా తర్వాత ఇళ్ల స్థలాల రేట్లు భారీగా పెరిగాయని తాజాగా ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. దాదాపుగా గత మూడేళ్లలో రూ.2.44 లక్షల కోట్ల విలువైన ఫ్లాట్లను డిమాండ్‌కు అనుగుణంగా ఆవిష్కరించినట్లు ఆ సంస్థ చెప్పింది.

Update: 2025-07-17 09:06 GMT

Housing plots: కరోనా తర్వాత ఫ్లాట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ప్రాప్ ఈక్విటీ నివేదిక

Housing plots: కరోనా తర్వాత ఇళ్ల స్థలాల రేట్లు భారీగా పెరిగాయని తాజాగా ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. దాదాపుగా గత మూడేళ్లలో రూ.2.44 లక్షల కోట్ల విలువైన ఫ్లాట్లను డిమాండ్‌కు అనుగుణంగా ఆవిష్కరించినట్లు ఆ సంస్థ చెప్పింది. ముందు ముందు ఇంకా ఇళ్ల స్థాలాల రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

కరోనా తర్వాత చాలామంది ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించుకోడానికి ఇష్టపడుతున్నారు. తమకు తగ్గట్టుగా, అనువుగా ఇళ్లను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు పర్మినెంట్‌గా నివాసం ఉండడానికి ఇల్లు కొనుగోలు చేయాలంటే ముందుగా ఇండివిడ్యుల్ ఇళ్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారని తాజాగా ప్రాప్ ఈక్వెటీ సంస్థ వెల్లడించింది. వివరాలు చూద్దాం..

కరోనా తర్వాతే ఇళ్ల స్థలాల గిరాకీ పెరిగిపోయింది. రూ. 2.44 లక్షల కోట్ల విలువైన ఫ్లాట్లను గత మూడేళ్లలో ఆవిష్కరించినట్లు ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. 2022 జనవరి నుంచి 2025 మే మధ్యకాలంలో టాప్ 1,2 నగరాల్లో 4.7 లక్షల ఇళ్ల ప్లాట్లతో కూడిన ప్రాజెక్టులను డెవలపర్లు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇండోర్, బెంగళూరు, చెన్నై, నాగ్ పూర్, జైపూర్, కోయంబత్తూర్, మైసూరు, రాయిపూర్, సూరత్ నగరాల గణాంకాలతో ప్రాప్ ఈక్విటీ నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం, అపార్ట్ మెంట్లతో పోలిస్తే లాభాల విషయంలో ప్లాట్ల రేట్లే ఎక్కువగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. అంతేకాదు తమకు నచ్చిన విధంగా ఇళ్లు కావాలంటే దానికి ఇళ్ల స్థలం కావాలి, దానికి తగ్గట్టుకట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కువమంది ప్లాట్ల వైపే మొగ్గు చూపుతున్నారని ప్రాప్ నివేదిక చెబుతుంది.

డిమాండ్ ఎక్కువ సరఫరా తక్కువ..


ఫ్లాట్ల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ సరఫరా చాలా తక్కువగా ఉంది. దీనివల్ల కొంత రేట్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. టాప్ టెన్ నగరాల్లో 2024లో ఒక లక్షా 26వేల 556 ఫ్లాట్లు సరఫరా అయితే, 2025లో అంటే జనవరి నుంచి మే నెల మధ్య కాలంలో 45 వేల 591 ఇళ్ల ఫ్లాట్లను డెవలపర్లు ప్రారంభించారు.

Tags:    

Similar News