Hyderabad: అతి తక్కువ ధరల్లో రాజీవ్ స్వగృహ ఇళ్లు
Hyderabad: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరొక సారి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరల్లో ప్లాట్లను తీసుకొచ్చింది.
Hyderabad: అతి తక్కువ ధరల్లో రాజీవ్ స్వగృహ ఇళ్లు
Hyderabad: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరొక సారి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరల్లో ప్లాట్లను తీసుకొచ్చింది. మార్కెట్ కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరలు ఉన్నాయి. నగరంలోని పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పటికీ చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఇళ్లు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. మార్కెట్ కంటే 40 శాతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని ఎస్ఈ సి భాస్కర్ రెడ్డి తెలిపారు. నాగోల్ బండ్లగూడలో 159 ప్లాట్లు, పోచారంలో 601 ప్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆసక్తి ఉన్నవారు ఈ ప్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చు.
బయట మార్కెట్‌తో రాజీవ్ గృహకల్ప కార్పొరేషన్‌ను పోలిస్తే.. బయట మార్కెట్లో చ. అడుగు విస్తీర్ణం ధర రూ. 4–6 వేల వరకు ఉంది. అంతకంటే తక్కువ ధరల్లో అంటే 40 శాతం ధరల్లో గృహకల్ప ప్లాట్లు ఉన్నాయి. అంటే దాదాపు చ. అడుగు విస్తీర్ణం ధర రూ. 2.5 నుంచి 3 వేలు ఉంది. మధ్యతరగతి ఆర్దిక స్తోమతను దృష్టిపెట్టుకునే ప్రభుత్వం ఈ రేట్లు పెట్టింది. కాబట్టి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చు.
బండ్లగూడ ప్రాజెక్ట్‌కు దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరించి 30న లాటరీ తీస్తామని, పోచారం ప్రాజెక్టు దరఖాస్తులను 31 వరకు స్వీకరించి ఆగష్టు 1న లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 60మంది బ్యాంకుల్లో డీడీలు కట్టారని, వందల మంది ధరఖాస్తులు సమర్పించారని తెలిపారు.