Senior Citizens: సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను 10శాతం పెంచుకునేందుకు అనుమతి..!
Senior Citizens: బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎఐ, బీమా కంపెనీలు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంను ఏటా 10 శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
Senior Citizens: సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను 10శాతం పెంచుకునేందుకు అనుమతి..!
Senior Citizens: సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంను ఏటా 10 శాతం వరకు పెంచుకునేందుకు భీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఏదైనా పెరుగుదల ఉంటే ఆరోగ్య బీమా కంపెనీలుఅనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ తన ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఐఆర్‌డిఎఐ నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జనవరి 30న ఐఆర్‌డిఎఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. బీమా కంపెనీలు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ఏటా 10 శాతం కంటే ఎక్కువ పెంచలేవని పేర్కొంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరుల ఆరోగ్య బీమా ప్రీమియంను భారీ మొత్తంలో పెంచాయి. దీంతో వ్యక్తిగత ఆరోగ్య బీమా అందించే సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలకు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంను ఏటా 10 శాతానికి మించి పెంచుకోవద్దని ఆదేశించింది.
సీనియర్ సిటిజన్లకు ప్రీమియంలో ప్రతిపాదిత పెరుగుదల సంవత్సరానికి 10 శాతం కంటే ఎక్కువగా ఉంటే, బీమా కంపెనీలు నియంత్రణ సంస్థతో ముందస్తు సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఐఆర్‌డిఎ తన ఉత్తర్వులో పేర్కొంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై నిశితంగా నిఘా ఉంచడం కొనసాగిస్తామని కూడా నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే నియంత్రణ సంస్థ ఈ నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు సహజంగానే ఆదాయ వనరులు ఉండవు. అలాంటప్పుడు ఆర్బీఐ 2-6శాతం టాలరెన్స్ బ్యాండ్‌ను నిర్ణయించింది. దీంతో వారి ఆరోగ్య బీమా ప్రీమియంలో సంవత్సరానికి 10శాతం వరకు పెరుగుదల ఎందుకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి సీనియర్ సిటిజన్ల ఆదాయం ప్రతి సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందా? అన్నది వారి ప్రశ్న.