Edible Oil Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలో వంటనూనె ధరలు తగ్గుతాయి!
Edible Oil Prices: జీడీపీ (GDP) గణాంకాలు విడుదలైన తర్వాత, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఒక పెద్ద శుభవార్తను అందించింది. దీంతో త్వరలో దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.
Edible Oil Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. త్వరలో వంటనూనె ధరలు తగ్గుతాయి!
Edible Oil Prices: జీడీపీ (GDP) గణాంకాలు విడుదలైన తర్వాత, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఒక పెద్ద శుభవార్తను అందించింది. దీంతో త్వరలో దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆహార ధరలను అదుపులోకి తీసుకురావడానికి, ముడి వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం తగ్గించినట్లు కేంద్రం శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ సుంకం తగ్గింపు మే 31 నుండి అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
భారతదేశం తన వనస్పతి నూనె(డాల్డా) అవసరాలలో 70 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాల నుండి పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. అలాగే, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ను కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వంటనూనెల ధరలను తగ్గిస్తుందని, తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి, పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు మరింత పెరుగుతాయని అంచనా.
ఏ నూనెపై ఎంత పన్ను తగ్గింది?
ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ పై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని గతంలో ఉన్న 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. దీనితో ఈ మూడు రకాల నూనెలపై మొత్తం దిగుమతి సుంకం గతంలో ఉన్న 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గుతుంది. ఇవి భారతదేశ వ్యవసాయ సెస్ పరిధిలోకి కూడా వస్తాయి.
గత నెలలో ఏ నూనెలు తగ్గాయి, ఏవి పెరిగాయి?
గత ఒక నెల విషయానికి వస్తే.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వేరుశెనగ నూనె, పామ్ ఆయిల్ ధరలలో తగ్గుదల కనిపించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్ 30న కిలోకు రూ. 190.44 ఉన్న వేరుశెనగ నూనె ధర మే 30 నాటికి రూ. 188.47కి తగ్గింది. పామ్ ఆయిల్ ధర దాదాపు రూ. 3 తగ్గి, రూ. 137.07 నుండి రూ. 134.09కి చేరింది. అయితే, ఆవ నూనె, వనస్పతి, సోయా ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.