Gold Rate Today: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి రేట్లు పెరిగాయి
Gold Rate Today: ఈరోజు బంగారం ధరలు, నవంబర్ 2: మీ నగరంలో 24K, 22K, 18K ధరలను తనిఖీ చేయండి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మరియు మరిన్ని
Gold Rate Today: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి రేట్లు పెరిగాయి
Gold Rate Today: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ఉండదన్న అంచనాలు, బలపడుతున్న డాలర్ విలువ, అలాగే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు బంగారం మీద పెట్టుబడులు తగ్గించడంతో పసిడి ధరలు కాస్త క్షీణించాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, నేడు ఉదయం (6.30 గంటల సమయానికి) దేశవ్యాప్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,23,000, కాగా 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,12,750గా ఉంది. మరోవైపు, వెండి ధర కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,52,000కు చేరింది.
హైదరాబాద్, విజయవాడ, కేరళ వంటి దక్షిణ భారత నగరాల్లో వెండి ధర రూ.1.66 లక్షలు/కిలోగా కొనసాగుతోంది.
పసిడి ధరలు నగరాల వారీగా (10 గ్రాములకు)
| నగరం | 24K | 22K | 18K |
|---|---|---|---|
| చెన్నై | ₹1,23,380 | ₹1,13,100 | ₹94,350 |
| ముంబై | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| ఢిల్లీ | ₹1,23,150 | ₹1,12,900 | ₹92,400 |
| కోల్‌కతా | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| బెంగళూరు | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| హైదరాబాద్ | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| కేరళ | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| పూణె | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
| వడోదరా | ₹1,23,050 | ₹1,12,800 | ₹92,300 |
| అహ్మదాబాద్ | ₹1,23,050 | ₹1,12,800 | ₹92,300 |
| విజయవాడ | ₹1,23,000 | ₹1,12,750 | ₹92,250 |
వెండి ధరలు నగరాల వారీగా (కిలోకు)
| నగరం | ధర (₹) |
|---|---|
| చెన్నై | ₹1,66,000 |
| ముంబై | ₹1,52,000 |
| ఢిల్లీ | ₹1,52,000 |
| కోల్‌కతా | ₹1,52,000 |
| బెంగళూరు | ₹1,52,000 |
| హైదరాబాద్ | ₹1,66,000 |
| విజయవాడ | ₹1,66,000 |
| కేరళ | ₹1,66,000 |
| పూణె | ₹1,52,000 |
| వడోదరా | ₹1,52,000 |
| అహ్మదాబాద్ | ₹1,52,000 |