Gautam Adani: గంగలో మునిగిన వెంటనే రూ.25వేల కోట్ల జాక్ పాట్ కొట్టిన గౌతమ్ అదానీ
Gautam Adani: దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ మంగళవారం మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
Gautam Adani: గంగలో మునిగిన వెంటనే రూ.25వేల కోట్ల జాక్ పాట్ కొట్టిన గౌతమ్ అదానీ
Gautam Adani: దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ మంగళవారం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. అక్కడ ఆయన తన చేతులతో తయారుచేసిన ఆహారాన్ని ప్రజలకు తినిపించారు. ఆ వెంటనే ఈ రోజు అదానీ ఓ శుభావార్త అందుకున్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన ఒక కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) రూ. 25,000 కోట్ల విలువైన భడ్లా-ఫతేపూర్ HVDC ప్రాజెక్టు లభించింది. ఇప్పటివరకు ఆ కంపెనీ అందుకున్న అతిపెద్ద ఆర్డర్ ఇదే. మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ నుండి ఉత్తర భారతదేశంలోని వివిధ కేంద్రాలకు ఆరు గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సరఫరా చేయనున్నట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) తెలిపింది.
రాజస్థాన్‌లోని భడ్లా, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ మధ్య ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు అవార్డుతో దాని ఆర్డర్ బుక్ రూ. 54,761 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఆర్డర్ అని తెలిపారు. ఈ ప్రాజెక్టును నాలుగున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ (TBCB) కింద అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) ఈ ప్రాజెక్టును కైవసం చేసుకుంది. కంపెనీకి ఈ ఒప్పందం 20 జనవరి 2025 లోనే లభించింది. అయితే కంపెనీ ఈరోజు షేర్ మార్కెట్లో దాని గురించి సమాచారం అందించింది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కందర్ప్ పటేల్ మాట్లాడుతూ.. దేశంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంతాల నుండి పునరుత్పాదక శక్తిని సమర్థవంతంగా రవాణా చేయడానికి, దానిని జాతీయ గ్రిడ్‌కు అనుసంధానించడానికి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) భారతదేశ కర్బన ఉద్గారాల తగ్గింపులో కీలకపాత్రను పోషిస్తోందని అన్నారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీని, పద్ధతులను ఉపయోగిస్తామన్నారు.అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (AESL) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ విద్యుత్ ప్రసార సంస్థ.
అయితే, స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లలో స్వల్ప క్షీణత కనిపించింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత బిఎస్ఇలో కంపెనీ స్టాక్ 0.28 శాతం తగ్గి రూ.813.35 వద్ద ముగిసింది. అయితే, కంపెనీ స్టాక్ రూ.819.95 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సెషన్‌లో రూ.826ని తాకింది. ఆ తర్వాత మార్కెట్ క్షీణత కారణంగా కంపెనీ వాటా కూడా రూ.803.20కి చేరుకుంది. నేడు కంపెనీ షేర్లు లాభాలను ఆర్జించవచ్చు.