Rule Changes May 1: అమూల్ నుంచి బ్యాంకుల వరకు.. నేటి నుంచి మారే రూల్స్ ఇవే
Rule Changes May 1: ప్రతి నెలా మొదటి తేదీన అనేక ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. గ్యాస్ సిలిండర్ల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల వరకు ఈ రోజే నిర్ణయిస్తారు.
Rule Changes May 1: అమూల్ నుంచి బ్యాంకుల వరకు.. నేటి నుంచి మారే రూల్స్ ఇవే
Rule Changes May 1: ప్రతి నెలా మొదటి తేదీన అనేక ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. గ్యాస్ సిలిండర్ల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల వరకు ఈ రోజే నిర్ణయిస్తారు. అయితే వీటితో పాటు నేటి నుంచి మీ ఆర్థిక జీవితంపై నేరుగా ప్రభావం చూపే మరికొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే అమూల్ పాల కోసం కూడా మీరు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. మరి ఈరోజు నుంచి అమల్లోకి వచ్చే ఆ 7 ముఖ్యమైన మార్పులు ఏమిటో వివరంగా తెలుసకుందాం
1. అమూల్ పాల ధర పెంపు
మదర్ డెయిరీ, వెర్కా బ్రాండ్‌ల బాటలోనే అమూల్ కూడా దేశవ్యాప్తంగా పాల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు అంటే గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్, అమూల్ చాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలు రూ.2 మేర పెరిగాయి.
2. ఏటీఎం లావాదేవీలపై మరింత భారం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం, మే 1, 2025 నుంచి ఏటీఎంల ద్వారా నిర్దేశించిన ఉచిత లావాదేవీల పరిమితి దాటిన ప్రతి అదనపు లావాదేవీకి ఛార్జీ రూ.21 నుంచి రూ.23కి పెరిగింది. ఈ ఛార్జీ ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. మెట్రో నగరాల్లో వినియోగదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు సార్లు, నాన్-మెట్రో ప్రాంతాల్లో ఐదు సార్లు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు.
3. రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు
భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇకపై స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు చెల్లవు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై ప్రయాణం కేవలం జనరల్ కోచ్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా, అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించారు.
4. ఎల్‌పీజీ సిలిండర్ ధరల సమీక్ష
ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. మే 1, 2025న గృహ, వాణిజ్య సిలిండర్ల ధరలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది.
5. ఏటీఎఫ్, సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల్లో మార్పులు
పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ప్రారంభంలో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను సమీక్షిస్తాయి. మే 1, 2025 నుంచి ఈ ఇంధనాల ధరలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది రవాణా, గృహ వినియోగంపై ప్రభావం చూపుతుంది.
6. బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు
ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి), సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించాయి. మే 1, 2025 నుంచి ఈ రేట్లలో మరిన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది పెట్టుబడిదారులను, పొదుపుదారులను ప్రభావితం చేస్తుంది.
7. బ్యాంకు సెలవుల జాబితా
మే 2025లో వివిధ పండుగలు, వారాంతాల కారణంగా బ్యాంకులకు మొత్తం 12 రోజుల సెలవులు ఉంటాయి. వీటిలో మే డే, బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి, ఆదివారాలు, రెండవ నాల్గవ శనివారాలు ఉన్నాయి. వినియోగదారులు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని వారి బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.