Flipkart Big Yearend Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్‌ఎండ్ సేల్ 2023.. స్మార్ట్ టీవీలపై బంపర్ తగ్గింపు..!
Flipkart Big Yearend Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్‌ఎండ్ సేల్ 2023 డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది.
Flipkart Big Yearend Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్‌ఎండ్ సేల్ 2023.. స్మార్ట్ టీవీలపై బంపర్ తగ్గింపు..!
Flipkart Big Yearend Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్‌ఎండ్ సేల్ 2023 డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లోస్మార్ట్‌ఫోన్‌లతో సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు ప్రకటించారు. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకురావచ్చు. కొడాక్, బ్లూపంక్ట్, థామ్సన్ స్మార్ట్ టీవీల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ రోజు వీటి గురించి తెలుసుకుందాం.
థామ్సన్ భారీ తగ్గింపులు
థామ్సన్ తన స్మార్ట్ టీవీలపై గొప్ప ఆఫర్‌లను ప్రకటించింది. రూ. 5,999/- నుంచి ప్రారంభ ధరలు ఉన్నాయి. థామ్సన్ భారతీయ వినియోగదారుల కోసం కొత్త శ్రేణి QLED, OATH PRO MAX, FA సిరీస్ టీవీ ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Blaupunkt స్మార్ట్ TV ఆఫర్లు
Blaupunkt Smart TV సిరీస్‌పై గొప్ప తగ్గింపును ప్రకటించింది. వినియోగదారులకు 75 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ.6,999 నుంచి ప్రారంభమవుతుంది.
తక్కువ ధరకే కొడాక్ స్మార్ట్ టీవీ
కొడాక్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా భారీ ఆఫర్‌లను అందిస్తుంది. కంపెనీ CA PRO, 9XPRO, KODAK మ్యాట్రిక్స్ QLED సిరీస్‌లపై గొప్ప డీల్‌లను అందిస్తోంది. టీవీలు రూ.6,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.