Fake currency: న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ఎలా గుర్తించాలంటే.. ఆర్బీఐ సూచ‌న‌లు ఇవే

Fake currency: దేశంలో నకిలీ కరెన్సీ ముప్పు మరింత వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్లకు గణనీయమైన డిమాండ్ ఉండటంతో, వాటి నకిలీలు ఎక్కువగా చలామణి అవుతున్నాయి.

Update: 2025-06-01 08:30 GMT

Fake currency: న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ఎలా గుర్తించాలంటే.. ఆర్బీఐ సూచ‌న‌లు ఇవే

Fake currency: దేశంలో నకిలీ కరెన్సీ ముప్పు మరింత వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్లకు గణనీయమైన డిమాండ్ ఉండటంతో, వాటి నకిలీలు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, రూ.500 నకిలీ నోట్లు గతేడాది కంటే 37.3% పెరిగాయి, రూ.200 నకిలీ నోట్లు 13.9% పెరిగాయి. అయితే రూ.10, 20, 50, 100, 2000 నోట్ల నకిలీ మోతాదులో మాత్రం కొంత తగ్గుదల కనిపించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,17,396 నకిలీ నోట్లు గుర్తించారు. వీటిలో కేవలం 4.7% మాత్రమే ఆర్బీఐ స్వయంగా గుర్తించగా, మిగిలిన 95.3% నోట్లు ఇతర బ్యాంకుల ద్వారా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేపథ్యంలో, నకిలీ నోట్లను గుర్తించడం త‌ప్ప‌నిస‌రిగా మారింది.

ఒరిజిన‌ల్ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి.?

రాతి బూడిద రంగులో ఉంటుంది. పరిమాణం: 66 మిమీ x 150 మిమీ ఉంటుంది. దేవనాగరి లిపిలో "500", “భారత్”, “ఇండియా” అని ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్ వంచినప్పుడు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది.

వాటర్‌మార్క్, అశోక స్తంభం, స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. వెనుక వైపున ఎర్రకోట చిత్రం, ముద్రణ సంవత్సరం, భాషా ప్యానెల్ ఉంటుంది.

రూ. 200 నోటులు ఎలా గుర్తించాలి.?

ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. 66 మిమీ x 146 మిమీ పరిమాణంతో ఉంటుంది. దేవనాగరిలో "200", “భారత్”, “ఇండియా” అని రాసి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారే థ్రెడ్ ఉంటుంది. రైజ్డ్ ప్రింటింగ్, మైక్రోటెక్స్ట్, వాటర్‌మార్క్ ఉంటాయి. వెన‌కాల సాంచి స్తూపం చిత్రం, ముద్రణ సంవత్సరం, భాషా ప్యానెల్, స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది.

ఆర్బీఐ నివేదిక ప్ర‌కారం రూ.500 నకిలీలు – 1,17,722, రూ.200 నకిలీలు – 32,660 మొత్తం నకిలీ నోట్లు 2022-23లో 2,25,769 కాగా, 2024-25లో 2,17,396కి తగ్గాయి. వీటిలో అధిక శాతం నోట్లు ప్రైవేట్ బ్యాంకులే గుర్తించాయి.

Tags:    

Similar News