EPFO: ఈపీఎఫ్‌వో అప్‌డేట్‌.. తల్లిదండ్రులకు జీవితకాల పెన్షన్‌..!

EPFO: ఈపీఎఫ్‌వో అప్‌డేట్‌.. తల్లిదండ్రులకు జీవితకాల పెన్షన్‌..!

Update: 2022-10-30 09:30 GMT

EPFO: ఈపీఎఫ్‌వో అప్‌డేట్‌.. తల్లిదండ్రులకు జీవితకాల పెన్షన్‌..!

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగులకి అనేక సౌకర్యాలని అందిస్తుంది. సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకి కూడా అనేక ప్రయోజనాలని కల్పిస్తోంది. ఖాతాదారుల తల్లిదండ్రులకి కూడా పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించింది. కానీ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకి మాత్రమే కాకుండా వారిపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్ అందిస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు సభ్యుడు మరణిస్తే అతని కుటుంబానికి ముఖ్యంగా అతని తల్లిదండ్రులకు అతని పెన్షన్ ప్రయోజనం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న వారి కొడుకు లేదా కూతురిని కోల్పోయినా పెద్దలకు డిపార్ట్‌మెంట్ పూర్తిగా అండగా ఉంటుందని ఈపీఎఫ్‌వో చెబుతోంది.కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగంలో ఉన్న పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయి.

ఈ షరతులను నెరవేర్చినట్లయితే జీవితకాల పెన్షన్ అందుబాటులో ఉంటుంది.

ఈపీఎఫ్‌వో ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే అతని కుటుంబంలో అతను ఏకైక జీవనోపాధిదారుడు అయితే అతని తల్లిదండ్రులకి EPS-95 నియమం ప్రకారం జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అయితే ఇందులోని షరతు ఏంటంటే సదరు ఉద్యోగి కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే సభ్యుడు ఉద్యోగం సమయంలో ఏదైనా వ్యాధి కారణంగా శారీరకంగా వైకల్యానికి గురైతే ఆ ఉద్యోగి కూడా జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటాడు. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయకపోయినా ఇది లభిస్తుంది.

Tags:    

Similar News