EPFO: పీఎఫ్ ఖాతాదారులకి హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే అకౌంట్ క్లోజ్..!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే అకౌంట్ క్లోజ్..!

Update: 2022-03-14 08:30 GMT

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే అకౌంట్ క్లోజ్..!

EPFO: జీతం పొందే వ్యక్తులకు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు వారి జీవితకాల సంపాదన. అందుకే ప్రతి ఒక్క ఉద్యోగి EPFOకి సంబంధించిన నియమాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఉద్యోగంలో ఉన్నంత కాలం మీరు EPFకి సహకరించండి. రిటైర్మెంట్‌ తర్వాత మీ వద్ద పెద్ద మొత్తం ఉంటుంది. ఈ డబ్బు ఆధారంగా మీ వృద్ధాప్యాన్ని సులభంగా గడపవచ్చు. కానీ చాలా సార్లు సమాచారం లేకపోవడం వల్ల ఉద్యోగులు తప్పులు చేస్తారు. దీనివల్ల PF ఖాతా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

మీరు ఇంతకు ముందు పని చేసిన కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మీ PF ఖాతాను బదిలీ చేయకపోతే అదే సమయంలో పాత కంపెనీ మూసివేస్తే మీ పీఎఫ్ ఖాతా 'ఇన్‌ఆపరేటివ్' కేటగిరీలో ఉంటుంది. అంతేకాకుండా మీ PF ఖాతా నుంచి 36 నెలల పాటు ఎటువంటి లావాదేవీ జరగకపోతే అంటే అందులో డబ్బు జమ కాకుంటే PF క్లోజ్‌ అవుతుంది. ఇలాంటి ఖాతాలు 'నిష్క్రియత్మకంగా' మారుతాయి. దీనివల్ల మీరు ఎటువంటి లావాదేవీలు చేయలేరు.

ఖాతాను మళ్లీ యాక్టివ్‌గా చేయడానికి మీరు EPFOకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఖాతాలో ఉన్న డబ్బుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అంటే మీ డబ్బు మునిగిపోలేదని అర్థం. మీరు దాన్ని తిరిగి పొందుతారు. ఇంతకు ముందు ఈ ఖాతాలపై వడ్డీ లభించేది కాదు కానీ 2016లో నిబంధనలను సవరించి వడ్డీ చెల్లిస్తున్నారు. మీరు 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మీ PF ఖాతాపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి EPF బ్యాలెన్స్ ఉపసంహరణకు దరఖాస్తు చేయనట్లయితే EPF ఖాతా 'నిష్క్రియం' అవుతుంది. పనిచేయని PF ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌ను సెటిల్ చేయడానికి ఉద్యోగి యజమాని ఆ క్లెయిమ్‌ను ధృవీకరించడం అవసరం. అయితే కంపెనీ మూసివేసిన సందర్భంలో ఉద్యోగులు, క్లెయిమ్‌ను ధృవీకరించడానికి ఎవరూ లేకుంటే KYC పత్రాల ఆధారంగా బ్యాంక్ క్లెయిమ్‌ను ధృవీకరిస్తుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News