EPFO : పీఎఫ్ వడ్డీ డబ్బులు జమయ్యాయా? మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO గతేడాది వడ్డీ డబ్బును అన్ని యాక్టివ్ ఖాతాలకు జమ చేసింది. EPF డబ్బుపై ప్రభుత్వం 8.25శాతం వార్షిక వడ్డీని ప్రకటించింది.

Update: 2025-07-12 03:45 GMT

EPFO : పీఎఫ్ వడ్డీ డబ్బులు జమయ్యాయా? మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO గతేడాది వడ్డీ డబ్బును అన్ని యాక్టివ్ ఖాతాలకు జమ చేసింది. EPF డబ్బుపై ప్రభుత్వం 8.25శాతం వార్షిక వడ్డీని ప్రకటించింది. మంగళవారం కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. ఈ వారం లోపే వడ్డీ డబ్బును అన్ని ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఆయన ప్రకారం, ఇప్పటికే దాదాపు అన్ని EPF ఖాతాలకు వడ్డీ జమ చేశారు. మొత్తం 33.56 కోట్ల EPF ఖాతాలలో 32.39 కోట్ల ఖాతాలకు వడ్డీ క్రెడిట్ చేశారు. మిగిలిన వాటికి ఈ వారం లోపు చేస్తామని ఆయన అన్నారు. మీ EPF ఖాతాకు వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

EPF ఖాతాదారులైతే, మీ ఖాతాలో ఉన్న డబ్బుకు ప్రభుత్వం నుండి వడ్డీ జమ అయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. కేవలం యాక్టివ్ ఖాతాలకు మాత్రమే వడ్డీ జమ అవుతుంది. అంటే, సంస్థ, మీ వాటా డబ్బు ప్రతి నెలా జమ అవుతున్న ఖాతాను మాత్రమే యాక్టివ్ ఖాతాగా పరిగణిస్తారు. మీరు గతంలో పని చేసిన కంపెనీలలో ఉన్న EPF ఖాతాలను కొత్త ఖాతాతో అనుసంధానం చేయకపోతే ఆ పాత ఖాతాలకు వడ్డీ లభించదు.

ఆన్‌లైన్‌లో EPF బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా

* EPF బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా తనిఖీ చేయవచ్చు:

* EPFO పోర్టల్‌ ఓపెన్ చేయాలి.

* హోమ్ పేజీలో For Employees కింద Our Services పై క్లిక్ చేయాలి.

* అక్కడ Member Passbook సెలక్ట్ చేసుకోండి.

* మీ UAN, Password నమోదు చేసి లాగిన్ అవ్వండి.

* లాగిన్ అయిన తర్వాత, మీ వివిధ పీఎఫ్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.

* లేటెస్ట్ అకౌంట్ సెలక్ట్ చేసుకుని మీ ఖాతా బ్యాలెన్స్‌ను చూడవచ్చు.

UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్

* మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు:

* ముందుగా UMANG App డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేయండి.

* అక్కడ EPFO సర్వీసెస్‌ విభాగానికి వెళ్లి లాగిన్ అవ్వాలి.

* లాగిన్ అయిన తర్వాత, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ

* మీ UANతో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ నుండి 9966044425 కు డయల్ చేయండి. ఒకట్రెండు రింగ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత, మీ లేటెస్ట్ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలిపే SMS మెసేజ్ మీకు వస్తుంది. అయితే, ఈ సర్వీసు పొందడానికి మీ KYC వివరాలు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.

SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ

* SMS ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు:

* ఈ పద్ధతికి కూడా KYC పూర్తి చేసిన UAN కు నమోదైన మొబైల్ నంబర్ అవసరం.

* EPFOHO అని టైప్ చేసి, ఆ తర్వాత మీ UAN నంబర్ ను నమోదు చేయండి.

* అనంతరం Language Code టైప్ చేసి 7738299899 నంబర్‌కు SMS పంపండి.

ఉదాహరణకు: మీరు తెలుగులో సమాచారం కావాలంటే, EPFOHO 123456789012 TEL అని టైప్ చేసి పంపవచ్చు. ఇక్కడ 123456789012 అనేది మీ 12 అంకెల UAN నంబర్, TEL అనేది కన్నడ భాషకు కోడ్.

Tags:    

Similar News