EPFO: నేడు ఈపీఎఫ్ఓ బోర్డు మీటింగ్.. కనీస పెన్షన్ రూ.7500 అవుతుందా ?

EPFO: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బోర్డు సమావేశం నేడు జరుగనుంది. ఈపీఎఫ్ ఖాతాల వడ్డీ రేట్లపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. EPFO ​​8.25 శాతం వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉంది.

Update: 2025-02-28 07:38 GMT

EPFO: నేడు ఈపీఎఫ్ఓ బోర్డు మీటింగ్.. కనీస పెన్షన్ రూ.7500 అవుతుందా ?

EPFO: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బోర్డు సమావేశం నేడు జరుగనుంది. ఈపీఎఫ్ ఖాతాల వడ్డీ రేట్లపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. EPFO ​​8.25 శాతం వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉంది. కానీ కొన్ని మీడియా నివేదికలు దానిలో స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదల ఉండవచ్చు అని చెబుతున్నాయి.

ఇప్పుడు వడ్డీ రేటు ఎంత?

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. అంతకు ముందు ఇది 8.15 శాతంగా ఉంది. 2019 నుండి 2021 వరకు ఇది 8.50 శాతంగా ఉంది. అయితే ఇప్పటివరకు అత్యధిక వడ్డీ రేటు 2001లో 12 శాతంగా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారు ప్రతి నెల బేసిక్ సాలరీ, కరవు భత్యంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. దీనితో పాటు సదరు యజమాని అంటే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. కానీ ఇందులో 8.33 శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS)కి వెళుతుంది. మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ కు యాడ్ అవుతుంది. .

15,000 కంటే తక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం ఈపీఎఫ్‌లో సభ్యత్వాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఈ జీత పరిమితిలోకి వచ్చే ప్రతి వ్యక్తికి పీఎఫ్ ఖాతా ఉండాలి.

ఈపీఎఫ్ ఎలా లెక్కిస్తారు?

బేసిక్ సాలరీ + డీఏ రూ. 14,000 అనుకుందాం.

ఉద్యోగి మొత్తం- 12% × 14,000 = 1,680

యజమాని పార్టు (EPF)- 3.67% × 14,000 = 514

యజమాని పార్టు(EPS)- 8.33% × 14,000 = 1,166

మొత్తం సహకారం (EPF + EPF) – 1,680 + 514 = 2,194

ఇప్పుడు, ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.25శాతం అయితే, నెలవారీ వడ్డీ 8.25% / 12 = 0.679% అవుతుంది.

కొత్త ఈపీఎఫ్ వడ్డీ రేటుపై నిర్ణయం ఏమిటి?

ఈసారి ఈపీఎఫ్ఓ ​​బోర్డు వడ్డీ రేటును కొద్దిగా తగ్గించవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో పతనం, బాండ్ దిగుబడి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ పెరగడం వల్ల ఒత్తిడి పెరిగింది. చాలా మంది వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. EPFO బోర్డు వడ్డీ రేటును నిర్ణయించిన తర్వాత, దానిని అమలు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలి.

అంతేకాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కనీస పెన్షన్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 2014 సెప్టెంబర్‌లో కేంద్రం కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000గా నిర్ణయించింది. 2025 బడ్జెట్‌కు ముందు ఈపీఎస్-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసింది. కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,500కి పెంచాలని, అలాగే డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను యాడ్ చేయాలని డిమాండ్ చేశారు. మరి నేటి సమావేశంలో దీని పై ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాలి.

దాదాపు 29.88 కోట్ల ఖాతాలతో ఈపీఎఫ్ఓ భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ. ఇది నవంబర్ 15, 1951న ఈపీఎఫ్ ఆర్డినెన్స్‌తో ప్రారంభమైంది. తరువాత దీనిని 1952 EPF చట్టం ద్వారా భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కర్మాగారాలు, ఇతర సంస్థల ఉద్యోగులను రక్షించడానికి ఈ చట్టం అమలు చేశారు.

Tags:    

Similar News