Tesla India: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. భారత్‌లోకి టెస్లా.. ఈ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు..!

Tesla India: అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ఆటోమోటివ్ కంపెనీ టెస్లా భారతదేశంలో ఎంట్రీకి సిద్ధమవుతుంది.

Update: 2025-02-19 09:30 GMT

Tesla India: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. భారత్‌లోకి టెస్లా.. ఈ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు..!

Tesla India

అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ఆటోమోటివ్ కంపెనీ టెస్లా భారతదేశంలో ఎంట్రీకి సిద్ధమవుతుంది. ఢిల్లీ, ముంబైలలో షోరూమ్‌ల కోసం స్థానాలను ఎంపిక చేశారు. అధికారుల నియామకం కూడా ప్రారంభమైంది. ప్రధాని మోదీ, మస్క్‌ల భేటీ అనంతరం కంపెనీ సన్నాహాలు ముమ్మరం చేసింది.

మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. అందుకే టెస్లా గత 3 సంవత్సరాలుగా దేశంలో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని తహతహలాడుతోంది. అయితే 100 శాతం దిగుమతి సుంకం కారణంగా వాయిదా వేస్తూ వస్తుంది. ఇటీవల వాషింగ్టన్ డీసీలో ప్రధాని మోదీ, ఎలన్ మస్క్‌ల సమావేశంలో సుంకాన్ని తగ్గించడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత టెస్లా ఢిల్లీ-ముంబైలలో షోరూమ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..బన్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐ) సమీపంలోని ఏరోసిటీ ప్రాంతంలో షోరూమ్ కోసం టెస్లా భూమిని లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతంలో హోటళ్లు, రిటైల్ దుకాణాలు, గ్లోబల్ కార్పొరేషన్ల కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా, కంపెనీ ముంబైలోని విమానాశ్రయానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వ్యాపార, రిటైల్ హబ్‌లో ఒక స్థానాన్ని ఎంచుకుంది. రెండు భూములు దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.

షోరూమ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా సమాచారం రాలేదు, అయితే టెస్లా దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించాలని యోచిస్తోంది. షోరూమ్‌ బహుశా టెస్లా ద్వారానే నిర్వహించవచ్చు. ఎందుకంటే ఇటీవల కంపెనీ భారతదేశంలో 13 పోస్టులకు ఖాళీని ప్రకటించింది. వీటిలో స్టోర్, కస్టమర్ రిలేషన్‌కు సంబంధించిన కొన్ని పోస్ట్‌లు ఉన్నాయి.

భారతదేశంలో విదేశీ కార్లపై 100 శాతం దిగుమతి సుంకం ఉంది. టెస్లా ప్రవేశానికి అతిపెద్ద అడ్డంకి ఇదే, కానీ అమెరికాలో అధికారం మారిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్ పాలసీపై పట్టుబట్టిన విధానం, దిగుమతి సుంకంలో మార్పు సాధ్యమే అని తెలుస్తుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. టెస్లా యజమాని ఎలోన్ మస్క్ కూడా ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.

Tags:    

Similar News