Top Billionaires: ప్రపంచ బిలియనీర్లలో టాప్‌లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ముకేశ్ అంబానీది ఎన్నో స్థానమో తెలుసా?
Top Billionaires: ప్రపంచంలో ఇంకా ఆర్దిక అసమానతలు ఉంటూనే ఉన్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూ వెళుతుంది.
Top Billionaires: ప్రపంచ బిలియనీర్లలో టాప్‌లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్… ముకేశ్ అంబానీది ఎన్నో స్థానమో తెలుసా?
Top Billionaires: ప్రపంచంలో ఇంకా ఆర్దిక అసమానతలు ఉంటూనే ఉన్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూ వెళుతుంది. తాజాగా 2025 2025 బిలియనీర్ల లిస్ట్‌ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో టాప్ ప్లేస్‌లో టెస్లా, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. మరి మన ముఖేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా 2025 వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఈ సారి ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 3,028 కి పెరిగింది. అంతేకాదు గత ఏడాది తక్కువ స్థానంలో ఉన్న బిలియనీర్లు ఈ సారి రెండు, మూడు స్థానాల్లోకి వచ్చారు. అంతేకాదు, ఈ ప్రపంచ కుబేరుల దగ్గరున్న మొత్తం సందప ఎంతో మీకు తెలుసా.. 16.1 లక్షల కోట్ల డాలర్లు.
నిజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా దేశాలు ఆర్ధిక అసమానతలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ బిలయనీర్లు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా 2025 వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే.. ఈ సారి మొదటి స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. అయితే జూన్‌తో పోలిస్తే ఆయన సంపద విలువ 16 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినా కూడా ఆయన వరల్డ్ బిలియనీర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
ఇక వరల్డ్ బిలియనీర్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నది ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్. అంతకుముందు ఆయన నాలుగో స్థానంలో ఉంటే ఇప్పుడు రెండో స్థానానికి ఎదిగారు. ఒరాకిల్ షేర్ 32 శాతం రాణించడం వల్లే ఆయన ర్యాంక్ పెరిగింది. ఇక మూడో స్థానంలో 247.9 బిలియన్ డాలర్ల సంపదతో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిలిచారు. ఇక ఆ తర్వాత నాలుగో ర్యాంక్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఐదో ర్యాంక్‌లో 147.7 బిలియన్ డాలర్ల సంపదతో ఎల్ వీ ఎం హెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు.
ఇక ఆరవ స్థానంలో గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఉంటే, ఏడవ స్థానంలో బెర్క్ షైర్ హాత్‌వేతో వారెన్ బఫెట్ నిలిచారు. అలాగే ఎనిమిదవ స్థానాన్ని మైక్రోసాఫ్ట్ స్టీవ్ బామర్ దక్కించుకోగా.. తొమ్మిదవ స్థానంలో గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ ఉన్నారు. ఇక పదవస్థానాన్ని ఎన్ విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ దక్కించుకున్నారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచ కుబేరుల సంపద జూన్‌తో పోలిస్తే 100 బిలియన్ డాలర్లు పెరిగి 2 లక్షల కోట్ట డాలర్లకు చేరింది. వీరిలో తొమ్మిది మంది అమెరికన్లే ఉండటం విశేషం. అదేవిధంగా సంపద విలువ 2 రోజుల్లోనే దాదాపు 30 శాతం తగ్గటంతో టాప్ టెన్ బిలియనీర్ల లిస్ట్‌లో మైక్రసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ స్థానం దక్కించుకోలేకపోయారు.
ఇక మన రిలియన్స్ ముఖేష్ అంబానీ బిలియనీర్ల లిస్ట్‌లో 116 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో ఉన్నారు. అంతేకాదు 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్న ఏకైకా ఆసియా వ్యాపార దిగ్గజం కూడా మన ముఖేష్ అంబానీయే. ఎప్పుడూ లేనంతగా ఈ సారి బిలయనీర్లు బాగా పెరిగారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని పలువురి ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.