PM Kisan Scheme: పీఎం కిసాన్‌ యోజనలో ఈ 3 తప్పులు చేయవద్దు.. త్వరలో ఇన్‌స్టాల్‌మెంట్‌ వచ్చేస్తుంది..!

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి పీఎం కిసాన్‌ యోజన స్కీంని ప్రవేశపెట్టింది.

Update: 2024-02-09 15:30 GMT

PM Kisan Scheme: పీఎం కిసాన్‌ యోజనలో ఈ 3 తప్పులు చేయవద్దు.. త్వరలో ఇన్‌స్టాల్‌మెంట్‌ వచ్చేస్తుంది..!

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి పీఎం కిసాన్‌ యోజన స్కీంని ప్రవేశపెట్టింది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఈ స్కీం కింద అర్హులైన రైతులకు నాలుగు నెలలకు రూ.2000 చొప్పున ఏడాదికి రూ. 6000 అందజేస్తారు. ఇటీవల ఈ ఆర్థిక సాయాన్ని పెంచాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దానిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వాయిదాలను డీబీటీ పద్దతిలో డైరెక్ట్‌గా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే కొంతమందికి ఈ సాయం అందడం లేదు. దీనికి కారణం వారు చేసే ఈ మూడు తప్పులే. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఈ-కెవైసి ప్రక్రియ

రైతులు ఈ-కేవైసీ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా పట్టుబట్టుతోంది. అయినప్పటికీ చాలామంది రైతులు దీనిని పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి లబ్ధిదారుడు e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. అలా చేయకుంటే అర్హులైన రైతుకు ఆర్థిక సాయం అందకుండా పోయే అవకాశం ఉంది. e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు సమీప CSC కేంద్రానికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా కూడా KYC చేయవచ్చు.

ఫారమ్‌లో పొరపాట్లు ఉండవద్దు

పీఎం కిసాన్‌ యోజన ఫారమ్‌ను నింపడంలో మీరు ఏదైనా తప్పు చేస్తే అప్లికేషన్‌ ఫాంని అధికారులు తిరస్కరిస్తారు. రైతులు చేసే సాధారణ తప్పులలో పేరు తప్పుగా నమోదు చేయడం, ఇంగ్లీష్‌కు బదులుగా హిందీలో పేరు రాయడం, తప్పు లింగాన్ని పూరించడం లేదా ఆధార్ నంబర్‌ను తప్పుగా నమోదు చేయడం వంటివి ఉంటాయి. వీటివల్ల వారికి ఆర్థిక సాయం అందదు. పెండింగ్ అని స్టేటస్‌ చూపిస్తుంది. వీటిని సరిచేసుకుంటే అన్ని వాయిదాలు అందే అవకాశం ఉంటుంది.

ల్యాండ్ వెరిఫికేషన్

మీ ల్యాండ్ వెరిఫికేషన్ పని ఇంకా పూర్తి కాకపోతే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ఆగిపోతాయి. ఈ స్కీం కింద ప్రతి రైతు భూమిని సరిచూసుకోవడం తప్పనిసరి. మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతా సమాచారం తప్పుగా ఉన్నప్పటికీ మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌ను కోల్పోతారు. కాబట్టి రైతులు ఈ మూడు తప్పులు లేకుండా ఎప్పిటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీఎం కిసాన్‌ ఇన్‌స్టాల్‌ మెంట్‌ రెగ్యులర్‌గా అకౌంట్‌లో జమ అవుతాయి.

Tags:    

Similar News