Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: 308.37 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77 వేల 367 పాయింట్లు... నిఫ్టీ 23 వేల 579 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమై... రోజంతా జోరు కొనసాగింది. చివరికి 308.37 పాయింట్ల లాభంతో 77 వేల 301 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92.30 పాయింట్ల లాభంతో 23 వేల 557 వద్ద స్థిరపడింది.