Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: 102 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్
Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మార్కెట్ అంచనాలు అందుకోని కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా అనే దానిపై దేశీ, విదేశీ మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సెక్స్ 80 వేల 408.90 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 102 పాయింట్ల నష్టంతో 80 వేల 502 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 21.65 పాయింట్ల నష్టంతో 24 వేల 509.25 వద్ద స్థిరపడింది.