Central Schemes: ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల గురించి మీకు తెలుసా.. కోట్లాది మంది జీవితాలను మార్చేశాయి..!

Central Schemes: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో కొన్నిఇప్పటికీ చాలా మందికి తెలియవు.

Update: 2023-09-27 15:30 GMT

Central Schemes: ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల గురించి మీకు తెలుసా.. కోట్లాది మంది జీవితాలను మార్చేశాయి..!

Central Schemes: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో కొన్నిఇప్పటికీ చాలా మందికి తెలియవు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని నిరు పేదల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపరచడానికి పనిచేస్తున్నాయి. ఇందులో మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని పథకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉజ్వల యోజన: ఈ పథకం దేశంలోని 9 కోట్ల మంది పేద మహిళలకు స్వేచ్ఛను ఇచ్చింది. దీనికింద మహిళలకు ఉచిత LPG కనెక్షన్‌లను అందిస్తుంది. సిలిండర్‌ల రీఫిల్‌కు సబ్సిడీ ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ఈ పథకంలో మరో 75 లక్షల మంది మహిళలను భాగం చేస్తామని ప్రకటించింది. తర్వాత మొత్తం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లు దాటుతుంది.

ఆయుష్మాన్ భారత్: ప్రధాని మోదీ పుట్టినరోజున 'ఆయుష్మాన్ భవ' ప్రచారం మొదలైంది. 'ఆయుష్మాన్ భారత్' పథకం ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి అందించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఈ పథకం కింద దేశంలోని పేద పౌరులు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను పొందుతారు. లబ్ధిదారుల సంఖ్య 25 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు 'ఆయుష్మాన్ భవ' ప్రచారం ద్వారా ప్రభుత్వం దీనిని 35 కోట్ల మందికి అంటే మొత్తం 60 కోట్ల మందికి విస్తరించాలని నిర్ణయించింది.

జన్ ధన్ ఖాతా: దేశంలోని ప్రతి పౌరుడుకి బ్యాంకు ఖాతా ఉండాలని ప్రధాని మోదీ ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా యోజన'ని ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ఈ ఖాతాలు ప్రజలకు సహాయం అందించడానికి ఉత్తమ సాధనంగా నిలిచాయి. మోడీ ప్రభుత్వం వీటి ద్వారా ప్రజలకు నేరుగా సబ్సిడీలను అందిస్తోంది. ఆగస్టు 2023 గణాంకాల ప్రకారం దేశంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది.

కిసాన్ సమ్మాన్ నిధి: ఈ పథకం దేశంలోని 11 కోట్ల మంది రైతుల జీవితాలను మార్చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌ కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున 3 వాయిదాలలో పొందుతారు.

ముద్రా యోజన: ప్రజలకు ఉపాధి కల్పించడానికి మోదీ ప్రభుత్వం ‘ముద్ర యోజన’ను ప్రారంభించింది. దీనికింద రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 40 కోట్ల మంది ఈ రుణ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా వారిలో 69 శాతం మంది మహిళలు ఉన్నారు.

Tags:    

Similar News